గ్లామర్ పాత్రలపై తమన్నా అసహనం!
Tamannaah Seeks Recognition Beyond Glamourదశాబ్ద కాలానికి పైగా అగ్రనటిగా వెలుగొందుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్‌కు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతంలో నటించేటప్పుడు తనకంటూ కొన్ని కఠినమైన నియమాలు, హద్దులు పెట్టుకున్న బ్యూటీ మారుతున్న కాలానికి .. ప్రేక్షకుల రుచికి అనుగుణంగా పంథాను మార్చుకుంటున్నారు. అయితే ఇప్పటికీ కొందరు దర్శక నిర్మాతలు తనను కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం చేయడానికి ప్రయత్నించడంపై అమ్మడు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.
కేవలం అందాల ఆరబోత పాత్రలకే పరిమితం చేయాలని చూస్తున్న తీరుపై తమన్నా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. నటిగా తనలోని పూర్తి స్థాయి ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉన్న పాత్రల కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. స్టార్ హీరోయిన్‌గా సుదీర్ఘ ప్రయాణం చేసినా? నటిగా తనకు సంతృప్తినిచ్చే వైవిధ్యమైన పాత్రలు చేయాలనేదే అసలు లక్ష్యమని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గ్లామర్ ఇమేజ్‌ను పక్కన పెట్టి పూర్తిగా నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు.
ప్రస్తుతం తమన్నా కమర్షియల్ చిత్రాలకే పరిమితం కాకుండా ప్రయోగాత్మక .. లేడీ ఓరియెంటెడ్ కథలను ఎంచుకుంటున్నారు. ఇందులో భాగంగానే `పురుషన్`, `ఐపిఎస్ మరియా`, `రాగిణి ఎంఎంఎస్`, `రేంజర్స్` వంటి విభిన్న చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాల్లో తమన్నా పాత్రలు ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటాయని నటిగా ఆమెలోని మరో కోణాన్ని ఈ చిత్రాలు వెండితెరపై ఆవిష్కరిస్తాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లలో వస్తున్న ప్రాజెక్ట్‌లపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.







































