ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై వేణు స్వామి జోస్యం
Venu Swamy's prediction regarding NTR's political entry
కోలీవుడ్ హీరో విజయ్ సునాయాసంగా రాజకీయాల్లో గెలిచి సీఎం అయిన దగ్గర నుంచి పలువురు హీరోలు రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారనే సంకేతాలు సోషల్ మీడియాకి చేరుతున్నాయి. కోలీవుడ్ హీరోలు ధనుష్, లారెన్స్ ఇలా అభిమానులతో వారు మూవ్ అవుతున్న తీరు చూస్తే వారి పొలిటికల్ ఎంట్రీ ఖాయమనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.
మరోపక్క తెలుగు హీరోలు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీట్స్ పెట్టడం, వారికి ఇన్సూరెన్స్ లు చేయించడం, అలాగే అభిమానులతో అల్లు అర్జున్ ఇంటరాక్ట్ అవడం అన్ని ఆయన రాజకీయ భవిష్యత్తుపై అనుమానాలు కలిగిస్తున్నాయి. మరోపక్క ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేస్తున్న హడావుడితో ఎన్టీఆర్ రాజకీయాలపై కూడా ఏపీలో హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి.
గతంలోనూ ఎన్టీఆర్ టీడీపీ పార్టీ కోసం పని చెయ్యడమే కాదు గొంతులో ప్రాణం ఉన్నవరకు టీడీపీ తోనే ఉంటా అని చెప్పారు. మధ్యలో ఎన్టీఆర్ అసలు రాజకీయాలవైపు తొంగి చూడకుండా సైలెంట్ గా ఉన్న సమయంలో ఆయన పొలిటికల్ ఎంట్రీపై తరచూ ఏదో ఒక న్యూస్ వినిపిస్తూనే ఉంది.
తాజాగా ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ రాజకీయాలపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎన్టీఆర్ పుట్టిన డేట్ ఒకటి, ఆయన బర్త్ డే చేసుకునే డేట్ ఒకటి. ఎన్టీఆర్ పాలిటిక్స్ లోకి వచ్చే సూచనలు నూటికి నూరు శాతం ఉన్నాయి. కానీ ఎన్టీఆర్ 2030 వరకు రాజకీయాల్లోకి రారు. 2029 ఎన్నికల తర్వాతే ఆయన పొలిటికల్ ఎంట్రీ ఉంటుంది.
రాజకీయాల్లో ఆయనకు అద్భుతమైన భవిష్యత్తు ఉంది, ఇప్పుడున్న ఏ పార్టీతోనూ ఎన్టీఆర్కు సంబంధం లేదు, కొత్త పార్టీతోనే పొలిటికల్ ఎంట్రీ ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా సీఎం అవుతారు, ఆయనకు సీఎం అయ్యే యోగం ఉంది, జయలలిత లాంటి యోగం ఉంది అంటూ వేణుస్వామి ఎన్టీఆర్ రాజకీయ భవిష్యత్తుపై చేసిన కామెంట్స్ చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు.







































