చైతు మైల్ స్టోన్ మూవీ డైరెక్టర్ ఎవరంటే..
Expectations on Naga Chaitanya milestone film
అక్కినేని యువ హీరో నాగ చైతన్య ప్రస్తుతం వృషకర్మ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రం దసరా బక్సాఫీసు బరిలో దిగుతుందా, లేదంటే డిసెంబర్ బరిలోనా అనేది ఇంకా సస్పెన్స్ లో ఉంది. అయితే నాగ చైతన్య కెరీర్ లో మైల్ స్టోన్ మూవీగా తెరకెక్కబోయే NC 25 చిత్రాన్ని డైరెక్ట్ చేసే డైరెక్టర్ పై సోషల్ మీడియాలో ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.
లక్కీ భాస్కర్, విశ్వనాథ్ అండ్ సన్స్ తో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి తో నాగవంశీ నిర్మాతగా నాగ చైతన్య నెక్స్ట్ మూవీ ఉండొచ్చనే బజ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. లక్కీ భాస్కర్ చిత్రం కన్నా ముందు వెంకీ అట్లూరి ఏ కథ రాసుకున్నా ముందు నాగ చైతన్య కే వినిపించేవారట.
మరి విశ్వనాథ్ అండ్ సన్స్ హిట్ తర్వాత నాగ చైతన్య ను డైరెక్ట్ చేసే ఛాన్స్ వెంకీ అట్లూరి కి వస్తుందేమో చూడాలి. ప్రస్తుతం అయితే వెంకీ అట్లూరి అటు తమిళ, ఇటు తెలుగు హీరోలకు మోస్ట్ వాంటెడ్ దర్శకుడిగా కనిపిస్తున్నారు.







































