దాని కోసం వెయిట్ చేస్తున్నా: సమంత
Samantha has opened up about embracing motherhood
టాప్ హీరోయిన్ సమంత తల్లి కాబోతుంది. ప్రస్తుతం ప్రెగ్నెంట్ తో ఉన్న సమంత మెటర్నిటీ లీవ్ గా నటన కు బ్రేక్ ఇస్తున్నట్టుగా ప్రకటించింది. నటనకు బ్రేకిచ్చినప్పటికీ సమంత తమిళ కుకింగ్ షో కి హోస్ట్ గా వ్యవరించబోతుంది. లేటెస్ట్ గా దానికి సంబందించిన ప్రోమో కూడా విడుదలైంది.
తాజాగా సమంత ఓ ఇంటర్వ్యూలో అమ్మతనంపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నేను తల్లిని కావడం నాకు ఎంతో ప్రత్యేకం. అమ్మ అనే పిలుపు కోసం ఎంతో పరితపించాను, అమ్మ కావడం కోసం ఏంతో ఎదురు చూసాను, అందుకే ఈ జర్నీ లో నేను నా సర్వస్వం ధారపొయ్యడానికి సిద్ధంగా ఉన్నాను.
నేను నా లైఫ్ లో ఏదైనా అంకితభావంతో చేస్తాను. ఇప్పుడు నాకు అదనపు శక్తి వచ్చినట్టుగా ఫీలవుతున్నాను, నా ప్రెగ్నెన్సీ జర్నీ లోని ప్రతి నిమిషాన్ని ఆస్వాదిస్తున్నాను అంటూ సమంత తను తల్లిని కావడంపై ఆ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ చూసి ఆమె అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు.







































