ఫ్యామిలీ ఎమోషన్స్ తమిళులకు నచ్చావా ?

Kollywood

 

తమిళ ఆడియన్స్ కి రా అండ్ రస్టిక్ కంటెంట్ తప్ప ఫ్యామిలీ ఎంటెర్టైనెర్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, క్లాసిక్ మూవీస్ నచ్చవా.. నచ్చితే కోలీవుడ్ హీరోలు నటించిన కుబేర, విశ్వనాథ్ అండ్ సన్స్ లాంటి చిత్రాలు తమిళ్ కన్నా ఎక్కువగా తెలుగులోనే ఎందుకు బెస్ట్ పెరఫార్మన్స్ ఇస్తున్నాయి.

టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ధనుష్ కుబేర అపుడు కూడా తమిళ్ కన్నా ఎక్కువ తెలుగు లో మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ కి తమిళంలో కన్నా తెలుగులోనే అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి. క్లాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా విశ్వనాథ్ అండ్ సన్స్ ని తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు.

తమిళులు కూడా విశ్వనాథ్ అండ్ సన్స్ ని మెచ్చుకుంటున్నారు. కానీ తెలుగు వాళ్లంత కాదు. తెలుగు ప్రేక్షకులు కోలీవుడ్ హీరో అయినా ఆదరిస్తున్నారు. కానీ తమిళ ప్రేక్షకులు తెలుగు డైరెక్టర్స్ తెరకెక్కించిన సినిమాలను చిన్న చూపు చూస్తున్నారో లేదంటే ఫ్యామిలీ ఎమోషన్స్ నచ్చవో తెలియదు కానీ.. కుబేర, విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాల విషయంలో తమిళ ఆడియన్స్ మైండ్ సెట్ వేరేలా కనిపిస్తుంది. 

Kollywood vs Telugu