వీకెండ్ హీరో ఆయనే
He is the weekend hero
గత శుక్రవారం ఐదు సినిమాలు బాక్సాఫీసు దగ్గర పోటీపడ్డాయి. అందులో సూర్య-వెంకీ అట్లూరి విశ్వనాథ్ అండ్ సన్స్, అగధ, విశాల్ మకుటం, అన్నపూర్ణ స్టూడియోస్ పళ్ళ బరుసు, హుషారు పిట్టలు చిత్రాలు విడుదల కాగా అందులో సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ కి హిట్ టాక్ వచ్చింది. మిగతా సినిమాలన్నీ గాల్లో కొట్టుకుపోయాయి.
తమిళంలో తెరకెక్కి తెలుగులోనూ విడుదలై అద్భుతమైన టాక్ తో అదిరిపోయే కలెక్షన్స్ తీసుకొస్తుంది విశ్వనాథ్ అండ్ సన్స్. రెండు రోజులకే సూర్య రూ.100 కోట్ల క్లబ్బు లో కాలు పెట్టారు. మూడు రోజులకే చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కి విశ్వనాథ్ అండ్ సన్స్ దగ్గరైపోయింది. వెంకీ అట్లూరి మేకింగ్, ముఖ్యంగా సూర్య నటన, మమిత బైజు-రాధికా శరత్ కుమార్ పెరఫార్మెన్స్ కి ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు.
పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా కుటుంబ ప్రేక్షకులకు దగ్గరైన విశ్వనాథ్ అండ్ సన్స్ ఈ వారం బాక్సాఫీసు హీరోగా నిలిచింది. ఈ వీకెండ్ లో థియేటర్స్ అన్ని ఫుల్ అయ్యి విశ్వనాథ్ అండ్ సన్స్ వీకెండ్ బెస్ట్ మూవీగా నిలవగా ఈ వీకెండ్ హీరోగా సూర్య నిలిచారు.







































