వృషకర్మ: రెండు నేలలంటే కష్టమేమో
Big Trouble for Vrushakarma Release
విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వంలో అక్కినేని యువ హీరో నాగ ఛైతన్య నటిస్తున్న వృషకర్మ ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అడ్వెంచర్ ఫాంటసీ మరియు యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న వృషకర్మ చిత్రాన్ని నిర్మాతలు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంపై ఓపెనింగ్ దగ్గరనుంచి మంచి అంచనాలు కనిపిస్తున్నాయి. మీనాక్షి చౌదరి చైతు కి జోడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్లో విడుదల చేసే ఛాన్స్ వుంది, ఎలాగూ #NBK 111 డిసెంబర్లో వచ్చే అవకాశం లేదు.. డిసెంబర్ 25 పై నాగ చైతన్య వృషాకర్మ కన్ను పడింది అనే టాక్ గట్టిగానే నడిచింది.
ప్రస్తుతం వృషకర్మ షూటింగ్ వైజాగ్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. అయితే నాగ చైతన్య వృషకర్మ ను దసరా బరిలో దించే ప్లాన్ చెయ్యమని దర్శకుడు కార్తీక్ దండు ని అడిగినట్లుగా వార్తలొస్తున్నాయి. దసరా అంటే రెండు నెలల సమయమే ఉంది. అప్పటికి సినిమా విడుదల సాధ్యమేనా, ఎందుకంటే ఇంకా షూటింగ్ ఫినిష్ కాలేదు, సీజీ వర్క్ కి సమయం కావాలి.
పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ ఇవన్నీ జస్ట్ రెండు నెలల్లో ఫినిష్ చేసేసుకుని సినిమాని విడుదల చెయ్యాలంటే సాధ్యమయ్యే పని కాదు.. మరి నాగ చైతన్య కోరికను కార్తీక్ దండు ఎంత స్పీడుగా నెరవేరుస్తాడో అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.







































