చిరు-బాబీ: డిఫ్రెంట్ టైటిల్

Mega158: Chiru Leaks his Title

 

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే కి టైమ్ దగ్గరకొచ్చేసింది. మెగా ఫ్యాన్స్ అప్పుడే అలెర్ట్ అవుతున్నారు. బ్లడ్ డొనేషన్, కేక్ కటింగ్స్, కొత్త సినిమాల అప్ డేట్స్ ని ఎంజాయ్ చెయ్యడానికి మెగా అభిమానులు రెడీ అయ్యారు. చిరు కొత్త చిత్రం విశ్వంభర నుంచి ఎలాంటి అప్ డేట్ వస్తుందో తెలియదు కానీ..

మెగా 158 నుంచి దర్శకుడు బాబీ మాత్రం అద్భుతమైన ట్రీట్ రెడీ చేసున్నారట. అది టైటిల్ గ్లింప్స్ తో చిరు కి బర్త్ డే విషెస్ తెలిపేందుకు, మెగా ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసేందుకు బాబీ సన్నద్ధమవుతున్నారని తెలుస్తుంది. తాజాగా చిరు-బాబీ టైటిల్ పై ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.

చిరు-బాబీ చిత్రానికి కదిరి కాకాజీ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజున ఈ టైటిల్ ని అధికారికంగా ప్రకటిస్తారని టాక్. మరి కదిరి కాకాజీ  అంటే కాస్త మాసివ్ గానే కాదు డిఫ్రెంట్ గాను కనిపిస్తుంది. ఈ చిత్రంలో చిరు కి కుమార్తె గా అనశ్వర రాజన్ నటిస్తుండగా.. నివేదా పేతురాజ కీలక పాత్రలో కనిపించబోతుంది.

Mega158 is titled Kadhiri