విశ్వనాథ్ అండ్ సన్స్ ఓవర్సీస్ టాక్

Vishwanath and Sons Overseas Talk

 

కోలీవుడ్ హీరో-టాలీవుడ్ డైరెక్టర్ కాంబినేషన్ లో తెరకెక్కిన విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం ఆగష్టు 14 న తెలుగు, తమిళ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. మంచి ప్రమోషన్స్, పాజిటివ్ వైబ్స్ తో సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్త ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే ఓవర్సీస్ షోస్ పూర్తి కాగా.. సినిమా గురించి ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.

విశ్వనాథ్ అండ్ సన్స్ ఓవర్సీస్ టాక్ లోకి వెళితే.. కథలోకి వెళ్లేందుకు దర్శకుడు వెంకీ అట్లూరి సమయం తీసుకున్నా తర్వాత ఎంటర్టైనర్ గా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. సూర్య సంజయ్ విశ్వనాథ్ పాత్రలో ప్రేక్షకులను కట్టిపడేసారు, అమిత బైజు క్యూట్ లుక్స్, నటన, మమిత-రాధికా శరత్ కుమార్ నడుమ సాగే డ్రామా అన్ని ఫస్ట్ హాఫ్ కి హైలెట్ గా నిలిచాయంటూ సినిమాని వీక్షించిన ఆడియన్స్ కొంతమంది ట్వీట్లు వేస్తున్నారు.

సెకండ్ హాఫ్ డీసెంట్ గా ఆకట్టుకుంటుంది. హాస్పిటల్ సన్నివేశం, ట్రిప్ కామెడీ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతాయి. జీవి ప్రకాష్ మ్యూజిక్ ఓకే ఓకె, సూర్య పెరఫార్మెన్స్ , ఎమోషనల్ గా ఆయన నటన ఆకట్టుకుంటాయి, మమితా బైజు, రాధిక శరత్ కుమార్‌ల అద్భుత నటన కనబరిచారు. అంటూ కొందరు ఆడియన్స్ ట్వీట్ చేసారు..

సినిమా బావుంది, ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అన్ని బావున్నాయి.. కాకపోతే సాగదీత సన్నివేశాలు, కథలోకి వెళ్లేందుకు చాలా సమయం తీసుకోవడం, మేలో డ్రామా ఇబ్బంది పెట్టాయి అంటూ మరికొందరు ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు.. విశ్వనాథ్ అండ్ సన్స్ పూర్తి సమీక్ష మరికాసేపట్లో..

Vishwanath and Sons Twitter Talk