ఒకే ప్రేమ్ లో న‌య‌న‌తార‌-టాక్సిక్ డైరెక్ట‌ర్!

Nayanthara

ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పాన్-ఇండియా చిత్రం `టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్`సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో  కీలక పాత్రలో నటిస్తున్న స్టార్ హీరోయిన్ నయనతార.. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న టాలెంటెడ్ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న నయనతార.. గీతూ మోహన్‌దాస్ పనితీరును, నటుల పట్ల ఆమె చూపించే ప్రేమను బహిరంగంగా కొనియాడారు.  ఈ సందర్భంగా నయనతార మాట్లాడుతూ.. గీతూ మోహన్‌దాస్‌తో తనకున్న సుదీర్ఘ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. ఇద్దరూ కలిసి దాదాపు 20 సంవత్సరాల క్రితం ఒక సినిమాలో నటించామని.. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడిలా  డైరెక్టర్-నటిగా కలవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

షూటింగ్ సమయంలో  కష్టమైన సన్నివేశం ముగిసిన తర్వాత సెట్‌లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని వివరిస్తూ.. గీతూ మోహన్‌దాస్ ఎంతటి సున్నిత మనస్కురాలో చెప్పుకొచ్చారు. ఒక నటుడికి .. నటికి వ్యక్తిగతంగా సపోర్ట్ అవసరమైనప్పుడు ఆమె స్వయంగా కారవాన్‌కు వెళ్లి ధైర్యం చెప్పి ప్రేమను మాత్రమే పంచుతారని న‌య‌న్ ఎమోషనల్ అయ్యారు. గీతూ మోహన్‌దాస్ నెరేషన్ ఇచ్చిన‌ప్పుడే  ఈ ప్రాజెక్ట్‌కు కనెక్ట్ అయ్యానని  సినిమా ప్రేక్షకులకు  సరికొత్త దృశ్యకావ్యంగా నిలుస్తుందని  ధీమా వ్యక్తం చేశారు.

Toxic Director