నేడు `విశ్వంభ‌ర‌`పై అప్ డేట్!

Will Vishwambhara Get an Update Today

 

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ సోషియో-ఫాంటసీ చిత్రం `విశ్వంభర`పై ఎలాంటి అంచ‌నాలున్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న  సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే గత కొంతకాలంగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మేకర్స్ నుంచి పెద్దగా అధికారిక అప్‌డేట్లు రాకపోవడంతో మెగా అభిమానులు  నీర‌సిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా నుంచి ఏదైనా  అధికారిక ప్రకటన వస్తుందా? లేదా? అనే దానిపై ఫిలిం సర్కిల్స్‌లో జోరుగా చర్చ సాగుతోంది.

ఈ నేప‌థ్యంలో చిత్ర యూనిట్  ఓముఖ్యమైన అప్‌డేట్  తీసుకొచ్చ‌యే అవకాశం ఉందని వార్తలు వ‌స్తున్నాయి. ముఖ్యంగా సినిమా విడుదల తేదీకి సంబంధించి గానీ..  టీజర్, గ్లింప్స్ లాంటి స్పెషల్ ట్రీట్ గురించిన ప్రకటన నేడు వెలువడే ఛాన్స్ ఉందంటూ ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఏదైనా ప్రత్యేకమైన విషయాన్ని అభిమానులతో పంచుకుంటారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

భారీ వీఎఫ్ఎక్స్ వర్క్స్‌తో రూపొందుతున్న చిత్రంపై ట్రేడ్ వర్గాల్లో  భారీ అంచనాలున్నాయి. మెగా అభిమానుల ఆసక్తిని గమనించిన చిత్ర బృందం త్వరలోనే వారి ఉత్సాహాన్ని రెట్టింపు చేసేలా అదిరిపోయే అప్‌డేట్‌తో ముందుకు రానుందని తెలుస్తోంది. మరి నేడు నిజంగానే మెగాస్టార్ నుంచి  `విశ్వంభర` గురించిన సంచలన ప్రకటన ఏదైనా వెలువడుతుందా లేదా అనేది  చూడాలి.

Will Vishwambhara Finally Get an Update Today