స్లమ్ డాగ్ - పవర్ ఫుల్ కేరెక్టర్ లో టబు

Slumdog: Tabu unleashes power


పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న స్లమ్ డాగ్ చిత్రం రిలీజ్ డేట్ విషయంలో తీవ్ర ఉత్కంఠ నడుస్తున్న సమయంలో సడన్ గా పూరి అండ్ టీమ్ ఈ చిత్రంలో నటిసున్న బాలీవుడ్ హీరోయిన్ టబు కేరెక్టర్ గ్లింప్స్ ని రిలీజ్ చేసారు. ఈ చిత్రంలో టబు గౌరీ హెగ్డే అనే పవర్ ఫుల్ కేరెక్టర్ లో నటిస్తుంది.

డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పాత్రలో టబు లుక్స్, ఆమె వాయిస్ ఇంటెన్సిటీ, డైలాగ్స్ అన్ని ఈ గ్లింప్స్ లో హైలెట్ గా నిలిచాయి. ఫస్ట్ కాలుస్తాం.. తర్వాతే మాట్లాడతాం.. అంటూ టబు చెప్పిన డైలాగ్ చూస్తుంటే స్లమ్ డాగ్ ఊర మాస్ గా ఉండబోతుంది అనేది అర్ధమవుతుంది.

ఈ చిత్రంలో విజయ్ సేతుపతి సరసన సంయుక్త నటిస్తుండగా.. స్లమ్ డాగ్ రిలీజ్ కమింగ్ సూన్ అంటూ మరోసారి సస్పెన్స్ లో పెట్టారు మేకర్స్. సెప్టెంబర్ లో స్లమ్ డాగ్ రిలీజ్ డేట్ ఉండొచ్చని తెలుస్తుంది. 

Tabu glimpse from Slumdog released