జాన్వీ కపూర్ తో శ్రీలీల లేడీ ఓరియేంటెడ్!
Sreeleela-Janhvi Kapoorటాలీవుడ్లో తనదైన నటన .. అద్భుతమైన డాన్స్ మూమెంట్స్‌తో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న టాలెంటెడ్ హీరోయిన్ శ్రీలీల బాలీవుడ్ లో లాంచ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓ రెండు ప్రాజెక్ట్ లు లాక్ అయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వస్తోంది. జాన్వీ కపూర్ తో కలిసి
శ్రీలీల ఓ లేడీ ఓరియేంటెడ్ చిత్రంలో నటిస్తుందని బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చలు ఇప్పటికే తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. గ్లామర్‌కే పరిమితం కాకుండా అభినయానికి ప్రాధాన్యత ఉన్న బలమైన కథాంశంతో ఈ సినిమాను రూపొందించడానికి ఓ ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
అలాగే దర్శకుడు వివరాలు కూడా అదే రోజు వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది. ఈ అవకాశం నిజమైతే? శ్రీలీలకు బాలీవుడ్ పెద్ద పీట వేస్తున్నట్లే. ఇప్పటికే ఆశీకీ సీక్వెల్ లో నటిస్తోంది. ఇందులో అమ్మడు పాత్ర పరంగా ఎక్కడా రాజీ పడటం లేదని తెలుస్తోంది. అలాగే మరో పెద్ద సినిమాకు ఎంపికైంది. తాజాగా జాన్వీతో తెరను పంచుకునే ఛాన్స్ ఇంట్రెస్టింగ్. తెలుగులో కొన్ని సినిమాలు చేసినా? శ్రీలీల ట్యాలెంట్ కు తగ్గ అవకాశాలైతే రాలేదనే చెప్పాలి.







































