ఈ భామలతో రొమాన్స్ చేసే హీరో ఎవరో?
Sreeleela, Jahnvi Kapoor's film in search for male protagonist
జాన్వీ కపూర్-శ్రీలీల కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారనే వార్తే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుందో.. ఈ హాట్ భామలతో రొమాన్స్ చేసే హీరో ఎవరో అనే విషయంలో ఫుల్ సస్పెన్స్ నడుస్తుంది ఇప్పుడు. ప్రస్తుతం హిందీలో జాన్వీ కపూర్, తెలుగులో శ్రీలీల సక్సెస్ కి దూరమయ్యారు.
పెద్ది తో బ్యాక్ అవుదామనుకున్న జాన్వీ కపూర్ కి ఆ చిత్రం అనుకోని షాకిచ్చింది. ఇక శ్రీలీల కి టాలీవుడ్ లో అసలు హిట్ అనే పదమే వినిపించడం లేదు. ఇప్పుడు హిందీలో శ్రీలీల - జాన్వీ కపూర్ కలయికలో ఒక రొమాంటిక్ థ్రిల్లర్ ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు ఏక్తా కపూర్, గునీత్ మోంగా కపూర్.
ఇద్దరు హాట్ హీరోయిన్స్ అంటే క్రేజీ స్టార్ హీరో ఉండాల్సిందే. అందులోను ఈ చిత్ర కథ కూడా ఇద్దరమ్మాయిలు ఒకే అబ్బాయి మీద విపరీతమైన ప్రేమ పెంచుకునే పాయింట్ తెరకెక్కబోతున్న చిత్రమట. మరి అలాంటి కథలో ఈ ఇద్దరి భామలతో రొమాన్స్ చెయ్యబోయే హీరోపైనే ఇప్పుడు విపరీమైన క్యూరియాసిటీ నడుస్తుంది.
హిందీలో ఎప్పుడో ఎంటర్ అయిన శ్రీలీల కు ఇంకా అక్కడ ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. ఇప్పుడు జాన్వీ కలిసి కనిపించే స్కోప్ దొరికింది.చూద్దాం జాన్వీ కపూర్, శ్రీలీల లతో రొమాన్స్ చెయ్యబోయే ఆ లక్కీ హీరో ఎవరో అనేది.







































