BB10: కంటెస్టెంట్స్ కు నాగ్ వార్నింగ్
BB10: Nag's warning to the contestants
బిగ్ బాస్ సీజన్ 10 మొదలు కావడానికి సమయం దగ్గరపడింది. ఆగస్టు 15 నుంచి బిగ్ బాస్ సీజన్ 10 హౌస్ లోకి వెళ్లేందుకు అగ్నిపరీక్ష కోసం కామన్ కంటెస్టెంట్స్ రెడీ అవుతున్నారు. సెప్టెంబర్ లో సీజన్ 10 మొదలు కాబోతుంది. తాజాగా బిగ్ బాస్ 10 ప్రోమో షూట్ లో పాల్గొన్న హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రోమో షూట్ చాలా బాగా జరిగింది. సీజన్ 3 నుంచి నేను ఈ షోను హోస్ట్ చేస్తున్నా. ఈసారి పదో సీజన్ కావడంతో బిగ్ బాస్ షో ని సరికొత్తగా, మరింత ఉన్నత స్థాయిలో ప్లాన్ చేస్తున్నాం. మాములుగా వేరేవాళ్ళ ప్రవర్తనను నిర్ణయించడం, సూచనలు చేయడం నాకసలు ఇష్టం ఉండదు. అందుకే మొదటి రెండు సీజన్స్ హోస్ట్ చేస్తున్నప్పుడు నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది.
ఆ తర్వాత మెల్లగా షో ఫార్మాట్ అలవాటైంది. సీజన్ 9 సూపర్ హిట్ కావడంతో, ఆడియన్స్ కోరిక మేరకు ఈసారి ఫిజికల్ టాస్కులు మరింత కఠినంగా ఉండబోతున్నాయి. షోలో కంటెస్టెంట్లు హద్దులు దాటి, లేదంటే క్రమశిక్షణ లేకుండా ప్రవర్తిస్తే అస్సలు అంగీకరించను.. అంటూ నాగార్జున రాబోయే కంటెస్టెంట్స్ కి ఇండైరెక్ట్ వారింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది.







































