డేర్ డెవిల్ ఓకే - మరి పారితోషికం

Ajith turns Dare Devil


కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ చాలా పెద్ద బ్రేక్ తీసుకున్నారు. కొన్నాళ్లుగా సినిమాలకు బ్రేకిచ్చి ఆయన కార్ రేసింగ్స్ అంటూ అటువైపు బిజీ అయ్యారు. గుడ్ బ్యాడ్ అగ్లీ తర్వాత అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ కుమార్ తన సొంత ప్రొడక్షన్ లోనే డేర్ డెవిల్ చిత్రాన్ని అనౌన్స్ చేసారు.

అయితే అజిత్ నెక్స్ట్ చిత్రం మొదలు కావడానికి ఆయన అధిక్ పారితోషికం డిమాండ్ చేస్తున్నారని, అందుకే నిర్మాతలెవరూ ఆయనతో సినిమా చేసేందుకు సిద్ధపడలేదని, దానితో అజిత్ తన ఓన్ ప్రొడక్షన్ లోనే ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసినట్లుగా కోలీవుడ్ మీడియా గుసగుసలాడుతోంది.

మరి ఓన్ ప్రొడక్షన్ అంటే అజిత్ ఈ డేర్ డెవిల్ కోసం బడ్జెట్ ఎంత పెడుతున్నారు. ఆయన వాటా ఎంత, దర్శకులకు ఎంత పారితోషికం ఇస్తున్నారు. మిగతా నటుల పారితోషికాలు వగైరా గురించి ప్రస్తుతం కోలీవుడ్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తుంది. 

Ajith new project gets powerful title