రామాయణ: శూర్పణఖ పాత్ర పై రకుల్ కామెంట్స్
Rakul Preet says Surpanakha’s complexity
బాలీవుడ్ లో ఎన్ని సినిమాలు చేసినా.. రామాయణ చిత్రంలో శూర్పణఖ పాత్రతో రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రేక్షకుల నోళ్ళలో వినిపించింది. సౌత్ నుంచి నార్త్ కి వెళ్ళిపోయాక రకుల్ ప్రీత్ సౌత్ దక్షిణాది సినిమాల్లో కనిపించడం మానేసింది. అక్కడ కూడా రకుల్ ప్రీత్ ట్రెండ్ అయ్యే సినిమా ఏమి చెయ్యలేదు. వచ్చిన అవకాశాలతో సర్దుకుపోతుంది.
కానీ రామాయణ తో రకుల్ ట్రెండ్ అవుతుంది. సీత గా సాయి పల్లవి కన్నా ఎక్కువగా నెగెటివ్ పాత్రధారి శూర్పణఖ పాత్రలో రకుల్ కనిపించిన తీరుకు ఆడియన్స్ ముగ్దులవుతున్నారు. ఆమె కాస్ట్యూమ్స్, అందం అన్ని రామాయణ ట్రైలర్ లో తెగ హైలెట్ అయ్యాయి. తాజాగా ఆ శూర్పణఖ పాత్రను తానెందుకు ఎంచుకున్నానో అనేది రకుల్ రివీల్ చేసింది.
నాకు ఛాలెంజింగ్ పాత్రలంటే ఇష్టం. అలాంటి పాత్రలు చాలా ఎనర్జీని ఇస్తాయి.. శూర్పణఖ పాత్ర అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది. అందుకే ఆ పాత్రకు ఓకే చెప్పా. ఇప్పటివరకు శూర్పణఖను అందరూ ఒక్క సన్నివేశంలోనే గుర్తుపెట్టుకున్నారు. కానీ ఆమె కథ ఇంకా చాలా ఉంది. రామాయణ రిలీజ్ అయ్యాక ఇతర కోణాల్లోనూ శూర్పణఖను చూస్తారని ఆశిస్తున్నా అంటూ రకుల్ చెప్పుకొచ్చింది.







































