రామ్ చరణ్ మణికట్టు సర్జరీ సక్సెస్

Ram Charan's wrist surgery successful


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి పెద్ది చిత్ర షూటింగ్ లో మణికట్టుకు గాయమైన విషయం తెలిసిందే. పెద్ది చిత్రం విడుదల తర్వాతే ఆయన సర్జరీ చేయించుకుంటాను అని, పెద్ది ప్రమోషన్స్ లో చేతి బెల్ట్ వేసుకుని ప్రమోషన్స్ పూర్తి చేసారు. తాజాగా రామ్ చరణ్ తన మణికట్టు సర్జరీ కోసం ఫ్యామిలీతో కలిసి కోయంబత్తూర్ వెళ్లారు.

కోయంబత్తూరులోని గంగ ఆసుపత్రిలోని స్పెషలిస్ట్ డాక్టర్స్ రామ్ చరణ్ చేతికి మణికట్టు సర్జరీ నిర్వహించారు. ఈరోజు సోమవారం రామ్ చరణ్ మణికట్టు సర్జరీ ని సక్సెస్ ఫుల్ గా డాక్టర్స్ పూర్తి చేసారు. నిన్న కోయంబత్తూర్ చేరుకున్న చరణ్ సాయంత్రం గంగ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఆయన వెంట తండ్రి చిరు, తల్లి సురేఖ, భార్య ఉపాసన వెళ్లారు.

ఈరోజు రామ్ చరణ్ కు డాక్టర్స్ విజయవంతంగా సర్జరీ పూర్తి చేసారు. శస్త్ర చికిత్స తర్వాత నాలుగు నుంచి ఆరు వారాల పాటు రామ్ చరణ్ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చరణ్ కు సూచించినట్టుగా తెలుస్తుంది. 

Ram Charan health update