ఆత్మకథ రాయబోతున్న సూపర్ స్టార్

Superstar set to write autobiography

 

సూపర్ స్టార్ రజినీకాంత్ బస్ కండెక్టర్ స్థాయి ఉంచి ఈ రోజు సూపర్ స్టార్ స్థాయికి ఎదిగారు. రజినీకాంత్ నటుడిగా విపరీతమైన క్రేజ్ ఉన్న హీరో. చాలా సింపుల్ గా ఉండే వ్యక్తి. ఎలాంటి ఆడంబరాలు చూపించని ఆయన రాజకీయాల్లోకి రావాల్సి ఉన్నా ఆరోగ్య కారణాల దృశ్య ఆ ఆలోచన విరమించుకున్నారు.

ప్రస్తుతం సినిమాలు చేసుకుంటున్న సూపర్ స్టార్ రజినీకాంత్ తన లైఫ్ జర్నీ ని అభిమానులతో పంచుకోవాలని అనుకుంటున్నారనే వార్త వైరల్ అవుతోంది. ఇప్పటికే సూపర్ స్టార్ తన ఆత్మకథ రాసే పనిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. కెరీర్ ఆరంభం నుంచి, కెరీర్ లో సక్సెస్ లు, టాప్ ప్లేస్ కి వెళ్లేందుకు ఆయన ఎదుర్కొన్న సవాళ్లు తదితర వివరాలన్నీ ఆ బుక్ లో ఉండనున్నట్లు తెలుస్తోంది.

అయితే రజినీకాంత్ ఈ బుక్ రాస్తున్న విషయం కానీ, లేదంటే మరె విషయాలు గాని అధికారికంగా బయటకు రాలేదు సూపర్ స్టార్ మాత్రం తన బుక్ విషయమై సన్నిహితులతో చర్చించినట్లుగా తెలుస్తుంది.

Rajinikanth is reportedly working on his autobiography