ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> I believe you will do it: Is Dhanush entering politics?

పాలిటిక్స్ పై ధనుష్ ఇండైరెక్ట్ క్లారిటీ

I believe you will do it: Is Dhanush entering politics?


హీరో విజయ్ పాలిటిక్స్ లోకి వచ్చాక చాలా త్వరగా క్లిక్ అవడమే కాకుండా అంతే స్పీడుగా అధికారంలోకి రావడంతో చాలామంది హీరోలు పొలిటికల్ ఎంట్రీపై కన్నేశారు అనే ప్రచారం జరిగింది. ఈలోపే హీరో ధనుష్ పొలిటికల్ ఎంట్రీ పై వార్తలు బలంగా మొదలయ్యాయి. ధనుష్ కూడా ఆ వైపే అడుగులు వేస్తున్నారా అనే అనుమానాలు మొదలయ్యాయి.

రీసెంట్ గా ధనుష్ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో ధనుష్ మాట్లాడుతూ, అభిమానులు కేవలం సినిమా వేడుకలకు పరిమితం కాకుండా ప్రజా సేవ చేయాలని, సినిమా మీటింగ్‌లకే పరిమితం కాకుండా తమ చుట్టుపక్కల ఉన్న పేద ప్రజలకు వీలైనంత సహాయం చేయాలని సూచించారు.

ఇలా అభిమానులు ఒకచోట చేరడం గొప్ప శక్తి అని, ఆ ఐక్యతకు ఒక మంచి లక్ష్యం ఉండాలని ధనుష్ అభిమానులను ప్రత్యేకంగా కోరడం చర్చనీయాంశమైంది. ధనుష్ రాజకీయ రంగప్రవేశానికే ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పటినుంచే అభిమానులను ఆ వేలో సిద్ధం చేస్తున్నారంటున్నారు. మరి ధనుష్ కూడా త్వరలోనే పాలిటిక్స్ లోకి వస్తారేమో చూడాలి. 

Dhanush urged fans to turn their unity towards welfare work in their localities