ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Akhil Reacts to Trolling Against His Wife Zainab

భార్య జైనాబ్ పై ట్రోలింగ్-అఖిల్ రియాక్షన్

Akhil Reacts to Trolling Against His Wife Zainab

 

గత ఏడాది అక్కినేని అఖిల్ ప్రేమ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. దుబాయ్ కి చెందిన వ్యాపార కుటుంబానికి చెందిన జైనాబ్ ను అఖిల్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. నాలుగేళ్ళ డేటింగ్ తర్వాత అఖిల్-జైనాబ్ లు పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. ఐతే అఖిల్ కన్నా జైనాబ్ పెద్దది, ఆమె వయసులోనే కాదు ఆహార్యంలోను అఖిల్ ని డామినేట్ చేస్తుంది. అక్కినేని ఫ్యామిలీకి జైనాబ్ ఏ మాత్రం సరిపోదు, ఆమె ఒక ముస్లిం అంటూ సోషల్ మీడియాలో జైనాబ్ ని విపరీతంగా ట్రోల్ చేసారు, చేస్తున్నారు.

తాజాగా భార్య జైనాబ్ పై ట్రోల్స్ విషయమై అఖిల్ మొదటిసారి రియాక్ట్ అయ్యాడు. తన భార్యకు తనకు ఉన్న ఏజ్ గ్యాప్ ని కానీ, ఆమె వేరే మతస్తురాలు అనే విషయాన్ని తానెప్పుడూ ఆలోచించలేదు అని, వాటి గురించి పెళ్ళికి ముందే మాట్లాడుకున్నాం, పెళ్లికి ముందు పెళ్లి తర్వాత నా భార్య జైనాబ్ పై జరిగిన ట్రోల్స్ గురించి ఆలోచించాలా లేదంటే నా 50 ఏళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించాలా..

నా లైఫ్ గురించే నేను ఆలోచించాను, నా భార్య స్థానంలోకి వచ్చాక ఇలాంటి ట్రోల్స్ వస్తాయి, అన్నిటికి సిద్ధంగా ఉండాలని నా భార్యకు ముందే చెప్పాను, తను కూడా అదే చేసింది. నేను శారీరకంగా బాధలో ఉన్నప్పుడు జైనాబ్ నాకు అండగా నిలిచింది. తమపై వచ్చిన ప్రతి ట్రోలింగ్ ని మేము దీవెనగా తీసుకున్నామంటూ అఖిల్ లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో తన భార్య పై జరిగిన ట్రోలింగ్ పై రియాక్ట్ అయ్యాడు. 

Akhil Akkineni first time reacts to trolling on his wife Zainab