Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Producer clarifies why the National Award wasn't won!

నేషనల్ అవార్డ్ రాకపోవడంపై నిర్మాత‌ క్లారిటీ!

Producer clarifies why the National Award wasn't won!

72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రకటన బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. `శ్రీకాంత్` చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచిన రాజ్‌కుమార్ రావుకు ఉత్తమ నటుడు అవార్డు దక్కుతుందని అంతా ఆశీంచారు.  కానీ ఆ పురస్కారం `చందూ ఛాంపియన్` చిత్రానికి గానూ కార్తీక్ ఆర్యన్‌ను వరించింది. అయితే ఈ పరిణామంపై బాలీవుడ్ స‌హా సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌క‌రాల చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

శ్రీకాంత్  అవార్డును కోల్పోయాడంటూ కామెంట్లు ప‌డుతున్నాయి. తాజాగా  ఈ వాదనలను `శ్రీకాంత్` చిత్ర సహ-నిర్మాత నిధి పర్మార్ హిరానందాని తోసిపుచ్చారు. రాజ్‌కుమార్ రావు ప్రతిభను జ్యూరీ ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించదని జ్యూరీతీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తామని వివ‌ర‌ణ ఇచ్చారు. కార్తీక్ ఆర్యన్ గెలుపు పూర్తిగా అర్హతతో కూడుకున్నదేనని ప్రశంసించారు.

`చందూ ఛాంపియన్` సినిమా కోసం కార్తీక్ పడిన కష్టం, ఆయన చూపించిన అంకితభావం ప్రశంసనీయమని, నేషనల్ అవార్డు జ్యూరీ సరైన నిర్ణయమే తీసుకుందని  పేర్కొన్నారు. తమ చిత్రంలో రాజ్‌కుమార్ రావు నటన అద్భుతంగా ఉందని `శ్రీకాంత్` సినిమాకు ఉత్తమ హిందీ చలనచిత్రంగా జాతీయ అవార్డు దక్కడం పట్ల తాము ఎంతో సంతోషంగా ఉన్నామని వెల్లడించారు. ప్రతిభావంతులైన నటులందరినీ గౌరవించాల్సిన అవసరం ఉందని మేకర్స్ అభిప్రాయపడ్డారు. నిర్మాత వివ‌ర‌ణ‌తో  హిందీ చిత్ర పరిశ్రమలో మరోసారి ఆరోగ్యకరమైన చర్చకు దారి తీసింది.

Srikanth Maker Reacts To Rajkummar Rao's National