Advertisement

జన నాయగన్ ఓవర్సీస్ టాక్

Jana Nayagan Overseas Talk

 

హీరోగా చివరి సినిమా, సీఎం గా ఫస్ట్ సినిమా తో స్టార్ హీరో విజయ్ జన నాయగన్ తో రేర్ ఫీట్ అందుకోబోతున్నారు. ఆరు నెలలుగా వాయిదా పడిన జన నాయగన్ పై తమిళనాట ఇసుమంతైనా క్రేజ్ తగ్గలేదు. దానికి నిదర్శనమే తమిళనాట జన నాయగన్ టికెట్ బుకింగ్స్. విపరీతమైన అంచనాలు పెట్టుకున్న విజయ్ ఫ్యాన్స్ కి జన నాయగన్ ఎలాంటి రిజల్ట్ ఇచ్చిందో అనేది జన నాయగన్ ఓవర్సీస్ టాక్ లో చూసేద్దాం.

జన నాయగన్ ఓవర్సీస్ టాక్ లోకి వెళితే.. విజయ్ వన్ మ్యాన్ షో, ఫస్ట్ హాఫ్ పూర్తి స్థాయి మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా సాగింది, సినిమాలో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే ఎలివేషన్ సీన్లు, కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి అంటూ విజయ్ అభిమాని ఒకరు సోషల్ మీడియాలో ట్వీట్ చేసారు.

జన నాయగన్ ఫస్ట్ హాఫ్ తనకు యావరేజ్ ‌గా అనిపించిందని, ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం సినిమాకే హైలైట్ అని, విజయ్ పంచ్ డైలాగ్ థియేటర్లలో అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పించాయి, దాన్ని తప్పించి కొన్ని రెగ్యులర్ మాస్ ఎలివేషన్ సీన్లు మాత్రమే ఆకట్టుకున్నాయని మరో నెటిజెన్ ట్వీట్ చేసాడు.

భగవంత్ కేసరిని గుర్తు చేసే కొన్ని సన్నివేశాలు కనిపించినప్పటికీ, దర్శకుడు హెచ్. వినోద్ వాటిని తనదైన ట్రీట్‌మెంట్‌తో కొత్తగా చూపించారంటున్నారు. అనిరుద్ BGM బావున్నా బాబీ డియోల్ ట్రాక్ చాలా అసంబద్ధంగా ఉందని, వీఎఫ్‌ఎక్స్ వీక్ క్వాలిటీ, విజయ్-మమిత బైజు ల తండ్రి-కూతురు ట్రాక్ ఎమోషనల్ గా కనెక్ట్ కాలేదు అంటూ మరికొంతమంది ఆడియన్స్ ట్వీట్ చేస్తున్నారు.

అసలు జన నాయగన్ ఎలా ఉంది అనేది పూర్తి స్థాయి సమీక్ష మరికాసేపట్లో.

Jana Nayagan Overseas Public Talk