అందుకే బాలీవుడ్ ని వదిలేసా-ప్రియాంక చోప్రా
Priyanka Chopra makes startling revelations
బాలీవుడ్ బ్లాక్ బ్యూటీ ప్రియాంక చోప్రా కెరీర్ పీక్స్ లో ఉండగా ఆమె బాలీవుడ్ ని వదిలేసి హాలీవుడ్ కి వెళ్ళిపోయింది. హాలీవుడ్ సినిమాలు, సిరీస్ లు చేసుకుంటూ తనకన్నా వయసులో చిన్నవాడైన పాప్ సింగర్ నిక్ జోనస్ ని వివాహం చేసుకునింది. ఆతర్వాత ప్రియాంక చోప్రా హవా హాలీవుడ్ లో బాగా కనిపించింది.
అయితే ప్రియాంక చోప్రా బాలీవుడ్ ని వదిలెయ్యడానికి కారణాలు ఉన్నా అవేమిటి అనే విషయం ఇప్పటివరకు రివీల్ అవ్వలేదు. తాజాగా ప్రియాంక చోప్రా తను ఎందుకు బాలీవుడ్ ని వదలాల్సివచ్చిందో అనే విషయాన్నీ బయటపెట్టింది. కొంతమందికి నచ్చినట్టుగా ఉండనందుకు, వారు చెప్పింది చెయ్యనందుకు వారు తమ సినిమాల నుంచి తప్పించారు.
కొంతమందిలా రాజి పడలేక నేను బాలీవుడ్ ను వదిలేసాను, ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను. నన్ను కావాలనే చాలా సినిమాల నుంచి తప్పించారు. ఒకసారి నేను ఓ సినిమా షూటింగ్ లో ఉన్నపుడు మరో సినిమా లో నటించే అగ్ర హీరో నా సినిమా సెట్ కి వచ్చారు. నాకు సపోర్ట్ చేసేందుకు ఆ హీరో వచ్చారు అనుకున్నాను.
కానీ ఆయన తన సినిమా నుంచి నన్ను తప్పించి మరొక హీరోయిన్ ని తీసుకున్నారనే విషయాన్ని స్వయంగా నాకు చెప్పడానికి వచ్చారు. ఇలా చాలానే జరిగాయి. దానితో నేను నా కెరీర్ గురించి ఆలోచించాను. అప్పటినుంచి నటనపైనే పూర్తి దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాను. నేను పడిన కష్టమే నా కెరీర్ ని నిలబెట్టి, మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టింది అంటూ ప్రియాంక చోప్రా హిందీ పరిశ్రమను వదిలేయాల్సి వచ్చిందో అనేది మొదటిసారి రివీల్ చేసింది.








































