అల్లు అర్జున్: రాకా కు బ్రేక్, ఫ్యామిలీకి టైమ్
Icon Star puts Raaka on break
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా ఫిలిం రాకా కు చిన్న బ్రేక్ ఇచ్చారు. అల్లు శిరీష్ పెళ్లి తర్వాత అల్లు అర్జున్ రాకా షూటింగ్ కి బ్రేక్ ఇవ్వకుండా కష్టపడుతున్నారు. ముంబై టు హైదరాబాద్ అంటూ తెగ తిరిగేస్తున్న అల్లు అర్జున్ ఇప్పుడు రాకా షూటింగ్ కి రెండు వారాల బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీకి టైమ్ కేటాయించారు.
రెండు వారాల పాటు అల్లు అర్జున్ తన భార్య స్నేహ, పిల్లలతో కలిసి వెకేషన్ కోసం విదేశాలకు చెక్కేశారు. ఈవిషయాన్ని అల్లు అర్జున్ భార్య స్నేహ సోషల్ మీడియాలో పిక్స్ షేర్ చేస్తూ రివీల్ చేసారు. భార్య, పిల్లలతో కలిసి అల్లు అర్జున్ విదేశీ ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక దర్శకుడు అట్లీ రాకా చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. రాకా షూటింగ్ ఎక్కువగా ముంబై పరిసర ప్రాంతాల్లోనే తెరకెక్కిస్తున్నారు. కీలక షెడ్యూల్ దుబాయ్ లో చేయాలనుకున్నా ప్రస్తుతం అక్కడి యుద్ధం కారణంగా ఆ షెడ్యూల్ ని వాయిదా వేశారు. పరిస్థితిలు చక్కబడితే దుబాయ్ వెళుతుంది టీమ్. లేదంటే మరో చోట ప్లాన్ చేస్తారట.








































