వారణాసి రేంజ్ లో కల్కి2 రిలీజ్!
Kalki 2రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ ప్రాజెక్ట్ వారణాసి వచ్చే ఏడాది 120 దేశాల్లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ నుంచి వస్తున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం `కల్కి 2`ని కూడా అదే స్థాయిలో అంతర్జాతీయ మార్కెట్లోకి తీసుకెళ్లాలని చిత్ర నిర్మాతలు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
కల్కి 2898 ఏడి మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా సాధించిన ఘనవిజయం రెండో భాగంపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది. పౌరాణిక ..సైన్స్ ఫిక్షన్ అంశాల కలయికతో రూపొందుతున్న ఈ చిత్రం పాశ్చాత్య ప్రేక్షకులకు సైతం సరికొత్త అనుభూతిని అందిస్తుందనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ధైర్యంగా ముందడుగు వేస్తున్నట్లు కనిపిస్తుంది.
అయితే దీనిపై స్పష్టత వారణాసి రిలీజ్ అనంతరం వస్తుంది. 120 దేశాల్లో సినిమా రిలీజ్ చేయడం అంటే చిన్న విషయం కాదు. చాలా సవాళ్లు ఎదురవుతాయి. రిలీజ్ అనంతరం సినిమా ఏమాత్రం ఫలితం తేడా కొట్టినా? భారీగా నష్టాలు భరించాల్సి ఉంటుంది. వీటన్నింటిని కల్కి 2 టీమ్ వారణాసి రిలీజ్ అనంతరం బేరీజు వేసుకుని తుది నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి కల్కి 2 గ్లోబల్ రిలీజ్ అన్నది ప్రస్తుతానికి ఆలోచన దశ వరకే పరిమితమని తెలుస్తోంది.







































