కష్టాల నుండి కెరీర్ బెస్ట్ సక్సెస్ వరకు భాగ్య శ్రీ!
Actress Bhagyashri Borse
గ్లామర్ ప్రపంచం బయట నుండి చూస్తే? తళుకు బెళుకులతో మెరుస్తూ కనిపిస్తుంది. కానీ దాని వెనుక ఎందరో కళాకారుల నిరంతర శ్రమ దాగి ఉంటుంది. భాగ్య శ్రీ బోర్సే వంటి నటీమణులు ఈ సత్యాన్ని తన జీవిత ప్రయాణం ద్వారా మరోసారి నిరూపించారు. సామాన్య నేపథ్యం నుండి వచ్చిన అమ్మడు ఎన్నో ఆర్థిక ఇబ్బందులను దాటుకుని పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుంది. కేవలం అదృష్టంపై ఆధార పడకుండా? తన నైపుణ్యానికి పదును పెట్టుకుంటూ మోడలింగ్ నుండి సినిమాల వైపు వేసిన అడుగులు ఎంతో మందికి స్ఫూర్తినిస్తాయి.
కెరీర్ ప్రారంభంలో నటి ఎదుర్కొనే సవాళ్లు అన్నీ ఇన్నీ కావు. అవకాశాలు దొరకడం ఒక ఎత్తయితే? వాటిని నిలబెట్టుకోవడం మరో ఎత్తు. భాగ్య శ్రీ బోర్సే కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు, కెరీర్ గ్రాఫ్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటి అంశాలను ఆమె ఒక పాఠంగానే తీసుకున్నారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా పరిశ్రమలో అడుగుపెట్టినప్పుడు ఎదురైన విమర్శలను పట్టించుకోకుండా.. తన పని తాను చేసుకోవడం వల్లే సాధ్యమైంది. ఏ పాత్ర దక్కినా? దానికి వంద శాతం న్యాయం చేయాలనే తపనే ఆమెను ముందుకు నడిపించింది.
ఇటీవలే రిలీజ్ అయిన `లెనిన్` విజయం అమ్మడి కెరీర్లో కీలకమైన మలుపుగా మారింది. మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న దశలో? ఈ చిత్రం భాగ్య శ్రీ ఆశించిన ఫలితాన్ని అందించి ఉత్సాహం నింపింది. వరుస అవకాశాలు లేకపోయినా? నిలకడగా వేచి ఉండి సరైన ప్రాజెక్ట్ను ఎంచుకోవడం వల్ల అమ్మడు ఇప్పుడు విజయపథంలో నిలిచారు. ఇప్పుడీ ఈ విజయం మరిన్ని భారీ ప్రాజెక్టుల వైపు వెళ్లే అవకాశాన్ని కల్పిస్తోంది. కష్టకాలంలో కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఉంటే ప్రతిభకు తగిన గుర్తింపు తప్పక లభిస్తుందని అమ్మడి ప్రయాణం మరోసారి నిరూపిస్తుంది.







































