రావు బహదూర్ - బాగా లేటైపోయింది

Sandeep Reddy Vanga Hails Rao Bahadur


సత్యదేవ్ నటించిన రావు బహదూర్ చిత్రం థియేటర్స్ లో ఆల్మోస్ట్ కనిపించకుండా పోయింది. సినిమా విడుదలకు ముందు రావు బహదూర్ పై మంచి బజ్ కనిపించడంతో ఆడియన్స్ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకుని థియేటర్స్ కి వెళ్లగా.. వారి అంచనాలను రావు బహదూర్ అందుకోలేకపోయింది.

అటు క్రిటిక్స్, ఇటు ఆడియన్స్ అందరూ రావు బహదూర్ పై యావరేజ్ రెస్పాన్స్ చూపించారు. ఆతర్వాత నాగ చైతన్య మరికొంతమంది ప్రముఖులు రావు బహదూర్ ప్రమోషన్స్ లో కనిపించారు. సినిమా చాలా బావుంది. మంచి సినిమా అని చెప్పారు. కానీ వర్కౌట్ అవ్వలేదు.

తాజాగా కల్ట్ డైరెక్టర్ సందీప్ వంగ రావు బహదూర్ చూసిన వెంటనే సోషల్ మీడియా వేదికగా తన స్పందను తెలియజేసారు. జస్ట్ వాచెడ్ రావు బహదూర్, సినిమాతో మనం ఎందుకు ప్రేమలో పడ్డామో మళ్లీ గుర్తు చేసే అరుదైన చిత్రాల్లో ఇది ఒకటి,  ప్రతి మూవీ లవర్ ఈ సినిమాకు మూడు గంటలు కేటాయించాలని, ఆ సినిమా మన సమయం, చప్పట్లకు అర్హత ఉన్న సినిమా.

సత్యదేవ్ నటన సెన్సేషనల్, దర్శకుడు వెంకటేష్ మహా సినిమాని తనకున్న పరిమిత వనరులతో చాలా చక్కగా తెరకెక్కించారు, ఇలాంటి సినిమాలు తీయాలంటే ధైర్యం కావాలి, నాయిస్ లేదు షార్ట్‌కట్స్ అస్సలు లేవు,  స్వచ్ఛమైన ఫిల్మ్ మేకింగ్ మాత్రమే ఉంది అంటూ సందీప్ వంగ సోషల్ మీడియాలో పోస్ట్ వేశారు.

మరి సినిమాని మెచ్చుకోవడం హ్యాపీనే. కానీ చాలా లేట్ అయ్యిపోయింది. థియేటర్స్ లో ఉండగా రావు బహదూర్ పై ఇలాంటి ట్వీట్లు పడితే కలెక్షన్స్ పై ప్రభావం పడేది. కానీ సినిమా థియేటర్స్ లో నుంచి వెళ్ళిపోయాక ఇంత మంచి ట్వీట్స్ వేసి ఏం ప్రయోజనం లేదు కదా అనేది నెటిజెన్స్ వాదన. 

Sandeep Reddy Vanga loved Rao Bahadur