హాలీవుడ్ గురించి హాట్ బ్యూటీ చెప్పిన చేదు నిజాలు
Disha Patani opens up on Hollywoodతెలుగు - హిందీ చిత్ర పరిశ్రమల్లో తనకంటూ స్టైలిష్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నటి దిశా పటానీ. తాజాగా ఈ బ్యూటీ హాలీవుడ్ కలను సాకారం చేసుకోవడం వెనుక ఉన్న కఠిన వాస్తవాలను బయటపెట్టింది. సాధారణంగా స్టార్ డమ్ ఉన్న నటీనటులకు విదేశీ ప్రాజెక్టులు సులభంగా వస్తాయని అంతా భావిస్తుంటారు. కానీ దిశా అభిప్రాయం ప్రకారం ఆ ఊహల్లో ఏమాత్రం వాస్తవం లేదు. డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ ద్వారా ఆడిషన్స్ పంపితే సరిపోతుందని అనుకుంటే పొరపాటేనని హాలీవుడ్ స్థాయిలో ఒక అవకాశం దక్కించుకోవడం అనేది నిరంతర యుద్ధమని అభిప్రాయపడింది
హాలీవుడ్ అనే గ్లోబల్ వేదిక మీద అడుగుపెట్టాలంటే మన సౌకర్యాలన్నింటినీ పక్కన పెట్టాల్సిందేనని దిశా అంటోంది. `అక్కడ కేవలం ముఖ కవళికలు .. గ్లామర్ చూసి అవకాశాలు ఇవ్వరు. ప్రాజెక్ట్ కోసం అక్కడికి వెళ్లడం, స్థానికంగా ఉంటూ ఆడిషన్ల కోసం గంటల తరబడి వేచి చూడటం, అక్కడి పని సంస్కృతిలో భాగస్వామ్యం కావడం అత్యంత అవసరం. ఇండియాలో ఉంటూ ఫోన్ కాల్స్ ద్వారా ప్రయత్నించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. స్వయంగా అక్కడ మకాం వేసి ప్రతిభను నిరూపించుకోవడానికి సిద్ధపడటమే ఏకైక మార్గమని తెలిపింది.
ప్రస్తుతం గ్లోబల్ సినిమా మార్పులకు అనుగుణంగా తానూ సిద్ధమవుతున్నానని హాలీవుడ్ అవకాశాల కోసం తాను చేసే ప్రయాణం ఓ పాఠం లాంటిదని దిశా భావిస్తోంది. పోటీ ప్రపంచంలో నిలబడాలంటే పేరు, ప్రతిష్టలు పక్కన పెట్టి ఒక కొత్త నటిగా ఆడిషన్స్ ఇవ్వడానికి సిద్ధపడిన రోజే నిజమైన గ్లోబల్ స్టార్‌గా ఎదిగే అవకాశం ఉంటుందని దిశ నమ్ముతోంది. దిశా పటానీ వ్యాఖ్యలు హాలీవుడ్ అవకాశాల కోసం ఆశపడే యువ నటీనటులకు వాస్తవ పరిస్థితులపై కొంత వరకూ అవగాహనను కల్పిస్తున్నాయన్నది వాస్తవం.







































