ఏంటీ ప్యారడైజ్ రగడ

Nani The Paradise


హీరో నాని - శ్రీకాంత్ ఓదెల కలయికలో రెండో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ చిత్రం షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు, ఆయా షేర్ సాంగ్ ప్యారడైజ్ పై విపరీతమైన అంచనాలు పెంచేసింది. అనిరుద్ రవిచంద్ర ప్యారడైజ్ ఆల్బమ్ ఎంత క్రేజీగా రూపొందిస్తున్నారో వైరల్ అవుతున్న ఆ సాంగ్ చూస్తే తెలుస్తుంది.

ఇక ఆగష్టు 21 ది ప్యారడైజ్ రిలీజ్ అంటూ ఎప్పుడో అనౌన్స్ చేసిన మేకర్స్ ఆ డేట్ నుంచి వెనక్కి తగ్గుతున్నారనే వార్త ఎప్పటినుంచో వైరల్ అవుతున్నా.. ప్యారడైజ్ మేకర్స్ ఇప్పటివరకు దానిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ప్యారడైజ్ చిత్రాన్ని సెప్టెంబర్ 24 న విడుదల చేసేందుకు మేకర్స్ యోచిస్తున్నారట. ఈ తేదిపై త్వరలోనే ప్రకటన రాబోతుంది అని తెలుస్తుంది.

గత కొద్దిరోజులుగా ప్యారడైజ్ రిలీజ్ పై ఊహాగానాలు రావడమే కానీ మేకర్స్ క్లారిటీ ఇవ్వకుండా కామ్ గా ఉన్నారు. షూటింగ్ పూర్తికానప్పుడు మొహమాటం లేకుండా రిలీజ్ డేట్ మారుస్తున్నామని చెప్పేస్తే పోలా, ఎందుకు ఈ రగడ అనేది నెటిజెన్స్ అభిప్రాయం.

ఈ చిత్రంతో ఫ్యాన్ ఇండియా మర్కెట్ లో బలమైన ముద్ర వెయ్యాలని నాని చాలా కష్టపడుతున్నాడు. ఈ చిత్రంలో కింగ్ మోహన్ బాబు విలన్ రోల్ లో కనిపించబోతున్నారు. మరి ఈ చిత్రం ఆగష్టు 21 నుంచి సెప్టెంబర్ 24 న విడుదల అని ఎప్పుడు ప్రకటిస్తారో మేకర్స్ చూడాలి.