రెండోరోజు అఖిల్ లెనిన్ భీబత్సం
Lenin 2 days collections poster
గత శుక్రవారం విడుదలైన అఖిల్ అక్కినేని లెనిన్ చిత్రం సూపర్ హిట్ టాక్ తో థియేటర్స్ లో భీబత్సం సృష్టిస్తుంది. అఖిల్ యాక్టింగ్, అఖిల్ లుక్, థమన్ హీటెక్కించే BGM, సినిమాటోగ్రఫీ అన్ని లెనిన్ ని ఆడియన్స్ కి నచ్చేలా చేసాయి. లెనిన్ మొదటి రోజు రూ.16 కోట్ల గ్రాస్ తీసుకొస్తే.. రెండోరోజు మరింతగా కలెక్షన్స్ పెంచుకుంది.
పాజిటివ్ టాక్ తో రెండోరోజు నైజాం లో లెనిన్ కోసం థియేటర్స్ ని యాడ్ చెయ్యడంతో లెనిన్ కలెక్షన్స్ రెండోరోజు పుంజుకున్నాయి. లెనిన్ రెండు రోజులకు కలిపి వరల్డ్ వైడ్ గా రూ.37.2 కోట్ల గ్రాస్ తీసుకొచ్చినట్టుగా నిర్మాతలు నాగార్జున, నాగవంశీ అఫీషియల్ పోస్టర్ తో ప్రకటించగానే అక్కినేని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. మూడోరోజు ఆదివారం లెనిన్ కి స్ట్రాంగ్ బుకింగ్స్ కనిపిస్తున్నాయి.
పదేళ్ల తర్వాత అఖిల్ సినిమా హిట్ అవడంతో అక్కినేని ఫ్యామిలీ నే కాదు అభిమానులు పండగ చేసుకుంటున్నారు. నాగార్జున అయితే దేవుడిని నా కోసం ఏమి కోరుకోలేదు, అఖిల్ కి ఈసారి బ్లాక్ బస్టర్ ఇవ్వమని తిరుమల శ్రీవారిని కోరుకున్నాను అని ఎమోషనల్ అయితే.. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే లెనిన్ హిట్ చూసి ఎమోషనల్ గా కన్నీళ్లు పెట్టుకుంది.







































