శ్రీలీల ఫీలవ్వాల్సిందే

Actress Sreeleela

 

లెనిన్ పై ప్రస్తుతం ఉన్న క్రేజ్, హైప్ చూస్తుంటే ఈ చిత్రం పక్కాగా హిట్ అవుతుంది అనిపిస్తుంది. లెనిన్ చుట్టూ పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. అఖిల్ అక్కినేని యాక్టింగ్ నెక్స్ట్ లెవల్ అంటూ లెనిన్ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ చెబుతున్న మాట. ఇక అఖిల్ తో సమానంగా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే గురించి సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.

నిజంగా ఇది చూసి మరో హీరోయిన్ శ్రీలీల ఫీలవ్వాల్సిందే. కారణం భాగ్యశ్రీ బోర్సే కన్నా ముందే లెనిన్ ప్రాజెక్ట్ లో అఖిల్ సరసన శ్రీలీల చెయ్యాల్సి ఉంది. ఆమె షూటింగ్ లో కూడా పాల్గొంది, లెనిన్ ఫస్ట్ లుక్ లో అఖిల్ పక్కన శ్రీలీల కనిపించింది. కానీ శ్రీలీల లెనిన్ నుంచి తప్పుకోవడం ఆ ప్లేస్ లోకి భాగ్యశ్రీ బోర్సే రావడం చకచకా జరిగిపోయాయి.

ఇప్పుడు భాగ్యశ్రీ బోర్సే కి లెనిన్ లో ఎంత కీలక పాత్ర దక్కిందో, ఆమె లెనిన్ ప్రమోషన్స్ లో ఎంతగా హైలెట్ అవుతుందో చూసి శ్రీలీల ఫీలవ్వాల్సిందే అంటూ మాట్లాడుకుంటున్నారు. లెనిన్ హిట్ అయితే శ్రీలీల మరింత బాధపడాల్సిందే. చూద్దాం లెనిన్ రిజల్ట్ ఏమిటి అనేది జులై పది వరకు వెయిట్ చేస్తే తెలుస్తుంది. 
 

Sreeleela-Lenin