వీడియో: మంటలు పెట్టిన దిశా పటానీ
Disha Patani latest glamour lookబాలీవుడ్ కామిక్ కేపర్ `వెల్‌కం టు ద జంగిల్` నుండి తాజాగా ఇంటర్నెట్‌లో లీకైన ఒక ప్రత్యేక గీతం సామాజిక మాధ్యమాలలో విపరీతమైన సంచలనాన్ని సృష్టిస్తోంది. ఈ సినిమాలో కథానాయికగా నటించిన దిశా పటానీ అత్యంత గ్లామరస్‌గా, బికినీ దుస్తులలో పోటీపడుతూ చేసిన నృత్య విజువల్స్ నెటిజన్లకు షాక్ ఇస్తున్నాయి.
ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఏకంగా ఇరవై చోట్ల కత్తెర వేయడానికి గల అసలు కారణాలు ఏమిటో ఈ ఘాటైన ఐటెం నంబర్ లీకులను చూస్తే స్పష్టంగా అర్థమవుతుందని సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. నడి సముద్రంలోని బీచ్ ఇసుక తిన్నెలపై అక్షయ్ కుమార్, దిశా పటానీల జంటపై చిత్రీకరించిన ఈ మత్తు గొలిపే గీతం యువతకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
ఈ చిత్రంలో సంజయ్ దత్, సునీల్ శెట్టి, పరేష్ రావల్ వంటి సీనియర్ తారలు ఉన్నా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి దర్శకుడు అహ్మద్ ఖాన్ ఈ గ్లామర్ అస్త్రాన్ని తెలివిగా ప్రయోగించినట్లు తెలుస్తోంది. అయితే అరవై ఏళ్లకు చేరువవుతున్న సీనియర్ హీరోతో ముప్పై నాలుగేళ్ల యువ నటి ఇంత రోమాంటిగ్గా చెలరగిపోవడం ఎంతవరకు సమంజసమంటూ కొందరు నెటిజన్లు సామాజిక మాధ్యమాలలో ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఫిరోజ్ ఎ. నడియాద్వాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రం సెన్సార్ కట్స్ .. ఈ భగభగమండే గ్లామర్ లీకుల నడుమ త్వరలోనే థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల కాబోతోంది.







































