వారణాసి ఇంకా నాలుగు నెలలే

Rajamouli on Varanasi shoot update

 

దర్శకధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ తో తెరకెక్కిస్తున్న వారణాసి షూటింగ్ కి బ్రేక్ లేకుండా సాగుతుంది. మహేష్ బాబు కూడా ఎలాంటి బ్రేక్ ఇవ్వకుండా వారణాసి షూటింగ్ కోసం ఈ వేసవి తాపాన్ని తట్టుకున్నారు. మరోపక్క ఎంతవరకు వారణాసి షూటింగ్ అయ్యింది, ఇంకా ఎంత బ్యాలెన్స్ ఇది అనే డౌట్ అయితే మహేష్ ఫ్యాన్స్ లో కనిపిస్తుంది. రీసెంట్ గా మహేష్ వారణాసి షూటింగ్ నుంచి బ్రేక్ దొరకడంతో తన ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్లారు.

అయితే వారణాసి షూటింగ్ ఎక్కడివరకు వచ్చింది, ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది అనేది రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసారు. రాజమౌళి ఎపిక్ బ్లాక్ బస్టర్స్ బాహుబలి ది టార్చ్ బేరర్ డాక్యుమెంటరీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ లో వచ్చిన సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన వారణాసి షూటింగ్ ముచ్చట్లు రివీల్ చేశారు.

వారణాసి షూటింగ్ లో మేజర్ పోర్షన్ కంప్లీట్ అయ్యింది. ముఖ్యమైన యాక్షన్ సీక్వెన్స్ లు అన్ని పూర్తయ్యాయి. ప్రస్తుతం చిన్న చిన్న సీన్స్, ఇంటర్ కనెక్టింగ్ సీన్స్ షూట్ చేస్తున్నాము. ఓ నాలుగు నెలల్లో అంటే సెప్టెంబర్ లేదా, అక్టోబర్ కల్లా వారణాసి షూటింగ్ పూర్తవుతుంది అంటూ క్రేజీ అప్ డేట్ ఇచ్చారు.

మరి పర్ఫెక్షన్ కోసం చెక్కిందే చెక్కే రాజమౌళి రెండేళ్లకు ఓ సినిమా షూటింగ్ చేస్తారనే పేరుంది. కానీ ఈసారి మహేష్ తో తీసే వారణాసి షూటింగ్ మాత్రం 18 నుంచి 19 నెలల్లోనే పూర్తి చేసి మిగతా నాలుగు నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి ఏప్రిల్ 7 కి సినిమా పాన్ ఇండియా మార్కెట్ లో దించేయ్యబోతున్నారు రాజమౌళి. 

Rajamouli mindblowing update on Varanasi