జైలర్ 2 రిలీజ్ డేట్ బజ్
Jailer 2 release buzz
సూపర్ స్టార్ రజినీకాంత్-నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో బ్లాక్ బస్టర్ మూవీ జైలర్ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల తేదీ విషయంలో మేకర్స్ దోబూచులాడుతున్నారు. ఇంకా షూటింగ్ పూర్తి కాకపోవడంతో జైలర్ 2 ఆగష్టు లో వచ్చే అవకాశం లేదు. సెప్టెంబర్ కానీ, అక్టోబర్ కానీ జైలర్ 2 విడుదల ఉంటుంది అంటున్నారు.
ఈ చిత్రంలో హృతిక్ రోషన్ గెస్ట్ రోల్ ప్లే చేస్తున్నారు, ఆయన ఇప్పటికే తన పాత్ర తాలూకు షూట్ కంప్లీట్ చేసారని అంటున్నారు. తాజాగా జైలర్ 2 ని అక్టోబర్ 16న పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇప్పటివరకు జైలర్ 2 కి సంబందించిన ప్రోపర్ అప్ డేట్స్ వదల్లేదు.
శివరాజ్ కుమార్, మోహన్ లాల్, ఇప్పుడు హృతిక్ రోషన్ ఎంట్రీ తో జైలర్ 2 పై భీభత్సమైన అంచనాలు కనిపిస్తున్నాయి. పాన్ ఇండియా మార్కెట్ లో పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయ్యే కంటెంట్ తో నెల్సన్ జైలర్ 2 ని తెరకెక్కిస్తున్నారు. అందుకే ఈ క్రేజీ మల్టీస్టారర్ పై అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి. విడుదల తేదీ విషయంలోనూ క్యూరియాసిటీ కనిపిస్తుంది.







































