లెనిన్ మేలుకోవాల్సిందే
Lenin Movie Update
అఖిల్ అక్కినేని లెనిన్ విడుదలకు జస్ట్ 14 రోజుల సమయమే ఉంది. లెనిన్ జులై 10 విడుదల అని నాగార్జున చెప్పారు. కానీ లెనిన్ దర్శకనిర్మాతల హడావిడి ఎక్కడా కనిపించడమే లేదు. ఓ టీజర్, ఓ పాట తప్ప లెనిన్ ప్రమోషన్స్ లేవు. నాగవంశీ ఈపాటికి లెనిన్ ప్రమోషన్స్ ఎగ్రెసివ్ గా స్టార్ట్ చేస్తారని అక్కినేని ఫ్యాన్స్ భావించారు.
హీరో అఖిల్-హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తో కలిసి సుమ ఇంటర్వ్యూ ఇచ్చారు తప్ప మరో ప్రమోషన్ లేదు. దానితో అక్కినేని ఫ్యాన్స్ నిర్మాత నాగవంశీ, దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరి ని టార్గెట్ చేస్తున్నారు. అఖిల్ లెనిన్ తో భారీ ఓపెనింగ్స్ వచ్చేలా చూడాలని అభిమానుల కోరిక. ప్రమోషన్స్ స్టార్ట్ అవ్వకపోతే క్రేజ్ ఏమొస్తుంది.
ప్రస్తుతం మా ఇంటి బంగారం ఊపులో అఖిల్ కూడా లెనిన్ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తే క్రేజ్ పెరుగుతుంది. అందుకే మేలుకో లెనిన్ అంటూ రిక్వెస్ట్ లు పెడుతున్నారు అభిమానులు. నాగార్జున కూడా ఈసారి లెనిన్ ప్రమోషన్స్ లో కనిపిస్తారు. ఆయన కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్.
మరి వీరంతా కలిసి లెనిన్ పై క్రేజ్ పెంచితే ఓపెనింగ్స్ బాగా వస్తాయి. లేదంటే లెనిన్ ఓపెనింగ్స్ డల్ అవుతాయి. అదే అభిమానుల గోల. మరి లెనిన్ ప్రమోషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో చూడాలి.







































