Advertisementt

బాబు-పవన్ విడదీయలేని బంధం

Thu 30th Apr 2026 10:59 AM
chandrababu  బాబు-పవన్ విడదీయలేని బంధం
CM Chandrababu Naidu బాబు-పవన్ విడదీయలేని బంధం
Advertisement
Ads by CJ

కూటమి కట్టి ఎన్నికల్లో పోటీ చేసి అధికారంలోకి వచ్చిన టీడీపీ-జనసేన-బీజేపీ పార్టీలు కేవలం ప్రజల కోసమే కాదు వాళ్ళ మధ్యన స్నేహం కుట్రలు చేసి చెడగొట్టేది కాదు అనేది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, సీఎం చంద్రబాబు నాయుడు కూడా పదే పదే పార్టీ కార్యకర్తలకు, వైసీపీ నేతలకు స్పష్టం చేస్తున్నారు.

చంద్రబాబు-పవన్ కళ్యాణ్ మద్యన వైరం పెట్టాలని వైసీపీ నేతలు ట్రై చేసినా మా మద్యన ఉన్నది స్నేహ బంధం అంటూ ఎప్పటికప్పుడు చాటి చెబుతున్నారు. పిఠాపురం ఇష్యు అయినా, ఇతర నియోజకవర్గాల్లో కార్యకర్తలు మద్యన ఈగో అయినా జనసేనాని పవన్, టీడీపి అధ్యక్షుడు చంద్రబాబు ఎప్పటికప్పుడు స్పష్టతనిస్తున్నారు. తాజాగా చంద్రబాబు మరోసారి ఆ విషయంపై క్లియర్ కట్ గా చెప్పేసారు.

పవన్ నేను కలిసే ఉంటాము, మీరేం చేసుకుంటారో చేసుకోండి అన్న రీతిలో టీడీపీ కార్యకర్తలకు, పార్టీ నేతలకు చంద్రబాబు తేల్చి చెప్పేసారు. కొన్ని నియోజక వర్గాల్లో జనసేనకు, టీడీపీ కార్యకర్తలకు అస్సలు పడడం లేదు. ఆ విషయమై చంద్రబాబు మీరు కొట్టుకున్నా, నేను చెప్పేది ఒక్కటే టీడీపీ, జనసేన మాత్రం ఎవరేం చేసినా, ఏం జరిగినా కలిసే ఉంటాయి.

కార్యకర్తలకే కాదు నేతలకు చంద్రబాబు ఒక్కటే చెప్పారు. సమస్యలు వస్తే సాల్వ్ చేసుకోవాలి కానీ మీడియా కి ఎక్కి కూటమి ప్రభుత్వ పరువు తియ్యొద్దని ఆయన హితవు పలికారు. ఈమధ్యన జ‌రిగిన కొన్ని ఘ‌ట‌న‌లు త‌న‌ను వ్య‌క్తిగ‌తంగా కూడా బాధించాయ‌ని.. మనం సుపరిపాలన అనే యజ్ఞం చేస్తున్నాం. కానీ, మన నేతలే సరిగా వ్యవహరించకుంటే బాధ కలుగుతోంది.. అని చంద్రబాబు చెప్పారు.

చంద్రబాబు మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ కూడా ఎప్పటికప్పుడు ఈ కూటమి 15 ఏళ్ళు కలిసే ఉంటుంది అని చెబుతున్నారు.

CM Chandrababu Naidu:

CM Chandrababu Naidu warns against indiscipline, urges TDP activists to strengthen party 

Tags:   CHANDRABABU
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ