ప్రమోషన్స్ టైమ్ లో షూటింగ్ ఏంటయ్యా..

Lenin movie promotion started


లెనిన్ పదే పదే రిలీజ్ డేట్స్ మార్చుకుంటూ చివరికి జులై 10 కి చేరింది. మే 1 నుంచి జూన్ 26 కి ఆతర్వాత జులై 10 కి లెనిన్ రిలీజ్ డేట్ మారింది. మరి సినిమా విడుదలకు ఇంకా 20 రోజుల సమయమే ఉంది. అంటే లెనిన్ ప్రమోషన్స్ తో మీడియా లో హడావిడి చెయ్యాల్సిన సమయం ఉంది.

కానీ లెనిన్ షూటింగ్ ఇంకా రామోజీ ఫిలిం సిటీ లో చేస్తున్నారు. ఈరోజు లేదంటే రేపటితో లెనిన్ షూటింగ్ ఫినిష్ అవుతుంది.. అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడం చూసి ప్రమోషన్స్ టైమ్ లో ఇంకా షూటింగ్ చెయ్యడమేమిటయ్యా అంటూ నెటిజెన్స్ కామెట్స్ పెడుతున్నారు.

అయితే అఖిల్ ఇప్పటికే తన హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే తో కలిసి సుమ కి ఇంటర్వ్యూ ఇచ్చేసాడు. ఇక మీడియాలోనే లెనిన్ టీమ్ కనిపించబోతుంది. ఒకటి రెండు రోజుల్లో షూటింగ్ ఫినిష్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ తో సహా లెనిన్ ప్రమోషన్స్ మొదలు పెట్టెయ్యబోతున్నారు. నాగవంశీ, నాగార్జున, అఖిల్, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే, దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరి లు లెనిన్ ఇంటర్వూస్ తో హడావిడి మొదలుపెట్టబోతున్నారు.  

Lenin