Advertisementt

NTRNeel కాంబోలో ఎన్టీఆర్ ఫెవరెట్ యాక్టర్

Tue 28th Apr 2026 08:54 AM
ntr  NTRNeel కాంబోలో ఎన్టీఆర్ ఫెవరెట్ యాక్టర్
Talented Actor Joins NTR Neel Epic NTRNeel కాంబోలో ఎన్టీఆర్ ఫెవరెట్ యాక్టర్
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల్లో నటుడు రాజీవ్ కనకాల కనిపిస్తే ఆ సినిమా హిట్ అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఒక బలమైన నమ్మకం మాత్రమే కాదు జనతా గ్యారేజ్ సమయంలో రాజీవ్ కనకాల ఆ సినిమా ప్రమోషన్స్  చెప్పాడు కూడా, ఎన్టీఆర్ సినిమాల్లో నేను కనిపిస్తే ఆ సినిమా హిట్ అంటూ సరదాగా మాట్లాడాడు. 

ఎన్టీఆర్-రాజీవ్ కనకాల మంచి మిత్రులు. కానీ మధ్యలో ఎక్కడో తేడా కొట్టి వారిద్దరి మధ్యన కాస్త దూరం కనిపించినా జనతా గ్యారేజ్ సమయం నుంచి కలిసి కనిపిస్తున్నారు. అంటే ఎన్టీఆర్ సినిమాల్లో ఎక్కువగా రాజీవ్ కనకాల ఉంటున్నాడు. ఇప్పుడు #NTRNeel కాంబో మూవీ లో కూడా రాజీవ్ కనకాల నటిస్తున్నాడట. తాజాగా రాజీవ్ కనకాల #NTRNeel షూట్ లో జాయిన్ అయినట్లుగా తెలుస్తుంది.

అంటే ఈ డ్రాగన్ మూవీ కూడా హిట్ అవుతుంది అనేది ఎన్టీఆర్ అభిమానుల్లో మొదలైన నమ్మకం. మరి రాజీవ్ కనకాల ఈ చిత్రంలో ఎలాంటి పాత్రలో కనిపిస్తాడో అనే క్యూరియాసిటీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో అప్పుడే మొదలయ్యింది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో #NTRNeel మూవీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ జరుగుతుంది. ఈ చిత్రం 2027 జూన్ 11 న విడుదల కాబోతుంది.  

Talented Actor Joins NTR Neel Epic:

Rajiv Kanakala Boards NTRNeel

Tags:   NTR
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ