Advertisementt

ఇకపై బడ్జెట్ పై ఫోకస్ పెడితే బెటర్

Mon 27th Apr 2026 11:26 AM
ott  ఇకపై బడ్జెట్ పై ఫోకస్ పెడితే బెటర్
Movie Budget ఇకపై బడ్జెట్ పై ఫోకస్ పెడితే బెటర్
Advertisement
Ads by CJ

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ లో ఏం జరుగుతుందో అనేది సామాన్య ప్రేక్షకుడికి అంతు బట్టడం లేదు. సినిమా రిలీజ్ లు నిర్మాతలు డిసైడ్ చెయ్యాలి కానీ ఓటీటీ డిసైడ్ చెయ్యడమేమిటి. సరే భారీ డీల్ ఇస్తుంది అందుకే నిర్మాతలు సినిమా విడుదల తేదీలను ఓటీటీ ల చేతుల్లో పెడుతున్నారు అని సమాధాన పడితే ఇప్పుడు ఓటీటీ లు అడ్డం తిరిగాయి.

సినిమా కొనే ముందు వెనుకాముందు ఆడుతున్నాయి. సినిమా డిజాస్టర్ అయితే అటు థియేట్రికల్ రెవిన్యూ ఉండదు, ఇకపై ఓటీటీ నుంచి కూడా భారీ లాస్ తప్పదు. కొన్నాళ్లుగా ఓటీటీ లు ఇచ్చే డీల్స్ చూసుకుని భారీగా బడ్జెట్ లు పెట్టి థియేటర్స్ ఓటీటీ ల మీద నిర్మాతలు ఆధారపడుతున్నారు. అదే అదునుగా తీసుకున్న ఓటీటీ లు కూడా నెత్తినెక్కి ఆడుతున్నాయి.

ఇకపై చిన్న, పెద్ద సినిమాలకు థియేట్రికల్ రెవిన్యూలో సగం చెల్లించే పద్దతికి ఓటీటీ లు శ్రీకారం చుట్టాయి. అంటే డిజాస్టర్ సినిమాలకు ఓటీటీ ల నుంచి నో రెవిన్యూ.   

బడ్జెట్ ఎక్కువ పెట్టడం, ఏళ్ళ తరబడి సెట్స్ పై సినిమాలు ఉండడం, హీరోలు రెమ్యునరేషన్స్ ఆకాశాన్ని తాకడం ఇవన్నీ తలకు మించి భారముగా మారి నిర్మాతలు కూడా ఓటీటీ ఎలా అంటే అలా తలాడిస్తున్నారు. అందుకే ఎనిమిదివారాల డీల్ ని పక్కనపెట్టి మూడు నుంచి నాలుగు వారాల్లోనే ధియేట్రికల్ రిలీజ్ లు ఓటీటీ లలోకి వస్తున్నాయి.

మరి పరిమిత బడ్జెట్, పారితోషికాలు తగ్గించుకుని సినిమాలు చేసి థియేటర్స్ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ కి అందిస్తే మళ్లీ థియేటర్స్ కి పూర్వ వైభవం వస్తుంది. ఇకపై హీరోలు, దర్శకనిర్మాతలు బడ్జెట్ పై ఫోకస్ పెడితే బెటర్.

Movie Budget:

Cinema Budget - OTT

Tags:   OTT
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ