తమిళ సినిమా ఇండస్ట్రీ లో తిరుగుబాటు మొదలైంది. కోలీవుడ్ లో మే 2 న షూటింగ్స్ నిరవధికంగా బంద్ చేపట్టాలని నిర్మాతల మండలి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. కేవలం షూటింగ్ బంద్ మాత్రమే కాదు.. సినిమా బడ్జెట్ తగ్గించేందుకు అత్యంత కఠినమైన నిబంధనలను అమలులోకి తెస్తున్నారు
అందులో భాగంగా నటీనటులకు పారితోషికాలు ఇవ్వకూడదని నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది. టాలీవుడ్ లో ప్రస్తుతం కొంతమంది హీరోలతో నడుస్తున్న డీల్ మాదిరి అంటే సినిమా విడుదలయ్యాక వచ్చే లాభాల్లో నటీనటులకు రెవెన్యూ షేరింగ్ ఇచ్చే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు.
కొన్ని ఓటీటీ సంస్థలు నిర్మాతలు బెదిరిస్తున్నట్లుగా తమ వద్దకు ఫిర్యాదులు వచ్చాయని, కాబట్టి షూటింగ్స్ ని నిరవధికంగా ఆపేసి సమస్యల పరిష్కారం కోసం ఇలాంటి కఠిన నిర్ణయాలు తప్పవని తమిళ నిర్మాతల మండలి తెలిపింది. మరి ఈ నిర్ణయాలపై తమిళ హీరోలు ఒప్పుకుంటారా అనే క్యూరియాసిటీ అభిమానుల్లో మొదలైంది.





రాజశేఖర్ గ్రేట్ లాస్ జర్నీ
Loading..