ఫైనల్ గా పెద్ది విడుదల తేదీని దర్శకుడు బుచ్చి బాబు సన అఫీషియల్ గా ప్రకటించారు. ఏప్రిల్ 30 నుంచి వాయిదా పడిన పెద్ది చిత్రం జూన్ 4 న విడుదలవుతుంది అన్నప్పటికి.. పెద్ది చిత్రాన్ని జూన్ 25 న విడుదల చేస్తున్నట్టుగా దర్శకుడు అధికారికంగా ప్రకటించారు. సో పెద్ది రిలీజ్ డేట్ కన్ఫ్యూజన్ కి నేటితో తెర పడింది.
నిన్నటివరకు పెద్ది విడుదల తేదీపై ఊహాగానాలు నడిచినా.. ఈరోజు దానికి స్పష్టత వచ్చేసింది. ప్రస్తుతం పెద్ది స్పెషల్ సాంగ్ షూట్ జరుగుతుంది. అది పూర్తయితే పెద్ది షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేస్తారు. ఇకపై ప్రమోషన్స్ స్టార్ట్ అని ఇప్పటికే చరణ్, దర్శకుడు బుచ్చి బాబు క్లారిటీ ఇచ్చారు.
ఇప్పుడు డేట్ లాక్ అయ్యింది, పాన్ ఇండియా మార్కెట్లో పెద్ది పై మరింత అంచనాలు పెరిగేలా టీమ్ ప్రమోషన్స్ మొదలు పెట్టనుంది. రామ్ చరణ్, హీరోయిన్ జాన్వీ, శివరాజ్ కుమార్, దర్శకుడు బుచ్చి లు పాన్ ఇండియా ప్రమోషన్స్ లో పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తుంది.




షాకింగ్-సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన హీరోయిన్
Loading..