Advertisementt

సమ్మర్ వెకేషన్ కి ప్రభాస్

Fri 24th Apr 2026 08:31 PM
prabhas  సమ్మర్ వెకేషన్ కి ప్రభాస్
Prabhas for summer vacation సమ్మర్ వెకేషన్ కి ప్రభాస్
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా వున్న హీరో. ఒకేసారి మూడు చిత్రాల షూటింగ్స్ తో బిజీ షెడ్యూల్స్ తో ప్రభాస్ కి ఊపిరి సలపడం లేదు. హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ, సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్, నాగ్ అశ్విన్ తో కలిసి 2. ఇంకా కల్కి 2 సెట్స్ లో ప్రభాస్ పాల్గొనలేదు. కానీ మే నుంచి ప్రభాస్ జాయిన్ అవుతారనే టాక్ ఉంది. 

ఇక ఈనెలలో స్పిరిట్ షెడ్యూల్ ఒకటి మే కి పోస్ట్ పోన్ అవడం, ఫౌజీ షూట్ కి కూడా బ్రేక్ రావడంతో ప్రభాస్ కి కాస్త సమయం చిక్కడంతో ఇమ్మడియేట్ గా సమ్మర్ వెకేషన్ ప్లాన్ చేసుకుని ఇటలీ వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది. ఈ హాలిడే తర్వాత ప్రభాస్ తిరిగి వచ్చి మళ్ళీ స్పిరిట్ ఇంకా ఫౌజీ షూటింగ్‌లో జాయిన్ అవుతారని తెలుస్తుంది.

ఈ నెలలో జరగాల్సిన స్పిరిట్ షెడ్యూల్ ని సందీప్ వంగ మే కి షిఫ్ట్ చెయ్యడంతో కల్కి 2 సెట్ లోను ప్రభాస్ కాస్త లేట్ గా జాయిన్ అవుతారని టాక్. ముందుగా  ఫౌజీ షూటింగ్ ఫినిష్ చేసేలా పరుగులు పెట్టడంతో అలసిపోయిన ప్రభాస్ ఈ బ్రేక్ ని వెకేషన్ ప్లాన్ చేసుకుని ఇటలీ లో ఎంజాయ్ చెయ్యబోతున్నారట.

Prabhas for summer vacation:

Prabhas has taken a short break from his busy shooting

Tags:   PRABHAS
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ