Advertisementt

రెండు కోట్ల అద్దె ఇంట్లో అల్లు అర్జున్

Thu 23rd Apr 2026 09:31 AM
juhu  రెండు కోట్ల అద్దె ఇంట్లో అల్లు అర్జున్
Allu Arjun shifts base to Mumbai రెండు కోట్ల అద్దె ఇంట్లో అల్లు అర్జున్
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ ముంబై కి మూవ్ అవుతున్నాడనే వార్త సెన్సేషన్ సృష్టించగా.. ఆయన తండ్రి ప్రముఖ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అల్లు అర్జున్ ముంబై కి షిఫ్ట్ అవుతున్నాడనే వార్తల్లో నిజం లేదని కొట్టి పారెయ్యడం తో అల్లు ఫ్యాన్స్ రిలాక్స్ ఫీలయ్యారు. అయితే అల్లు అర్జున్ ముంబై కి పూర్తిగా షిఫ్ట్ అవ్వకపోయినా.. రాకా చిత్ర షూటింగ్ కోసం ఓ రెండున్నరేళ్ల పాటు ముంబై లో ఉండాల్సి ఉంది.

అందుకే అల్లు అర్జున్ ముంబై లోని కాస్ట్లీ ప్రాంతమైన జుహు లో విశాలమైన ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారట. ఫైవ్ బెడ్ రూమ్స్ తో కూడిన, నాలుగు కారు పార్కింగ్స్ కలిగిన విశాలవంతమైన ఇంటిని అల్లు అర్జున్ ఏడాది కి రెండు కోట్లు అద్దె చెల్లించి మూడేళ్ళ పాటు ఆ ఇంటిని లీజు అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. 

మరి కోట్ల లో పారితోషిక తీసుకునే అల్లు అర్జున్ అద్దె ఇంటి కోసం ఈ మాత్రం చెల్లించడం పెద్ద విషయం కాదు. ఇక అల్లు స్నేహ కూడా ఎక్కువగా అల్లు అర్జున్ తో ముంబై లోనే ఉంటుంది అని, పిల్లల కోసం అల్లు స్నేహ హైదరాబాద్ టు ముంబై తిరుగుతుంది అని తెలుస్తుంది. అట్లీ తో చేస్తున్న రాకా షూటింగ్ ఎక్కువగా ముంబై లో ఉంటుంది కాబట్టే అల్లు అర్జున్ ఇలా ముంబై లో ఇంటిని అద్దె కి తీసుకున్నారట.

Allu Arjun shifts base to Mumbai:

Juhu house rent - Allu Arjun shifts base to Mumbai

Tags:   JUHU
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ