ప్రముఖ డైరెక్టర్ భారతి రాజా మృతి
Bharathiraja passes away
తమిళ, తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఈరోజు తీరని లోటు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో పేరు పొందిన లెజెండరీ దర్శకుడు భారతి రాజా ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న భారతీ రాజా చెన్నైలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
1941 జూలై 17న తమిళనాడులో జన్మించిన భారతీరాజా, 1977లో విడుదలైన పదహారేళ్ళ వయసు చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. గ్రామీణ నేపథ్యంలో సహజత్వానికి దగ్గరగా కథలు చెప్పడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. భారతీరాజా మృతి తో దక్షిణ భారత సినీ పరిశ్రమ ఒక గొప్ప దర్శకుడిని కోల్పోయిందంటూ సినీ ప్రముఖులు, అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Bharathiraja breathes his last








































