ఇటీవల విదులైన `లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ`తో కృతిశెట్టి మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చింది. అమ్మడికి చాలా కాలం తర్వాత పడిన హిట్ ఇది. భవిష్యత్ కాలం నేపథ్యంలో సాగే సినిమాలో తన పాత్ర , కథలోని ప్రధాన సందేశం తనను వ్యక్తిగతంగా ఎంతో కదిలించాయని తాజాగా పేర్కొంది. ముఖ్యంగా ఈ తరం ప్రేమకథల్లో ఉండే వేగం, మార్పుల మధ్య మనల్ని మనం కోల్పోకూడదనే విషయాన్ని ఈ చిత్రం ద్వారా తాను బలంగా గ్రహించినట్లు అమ్మడు అభిప్రాయపడింది.
సినిమాలో ధీమ పాత్ర గురించి ప్రస్తావిస్తూ.. `మనల్ని ఎవరైనా ప్రేమించాలంటే మనం ఏదో ఒకటి సాధించాల్సిన పనిలేదు. మనం ఎలా ఉన్నామో అలాగే మనల్ని మనం ఆమోదించుకోవడం ముఖ్యం అని కృతి అభిప్రాయపడింది. `మనం మనలా ఉండటమే సరిపోతుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్రేమ అనేది ఎవరి దగ్గర నుంచో సంపాదించుకోవాల్సింది కాదు. అది సహజంగా లభించేదని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేటి కాలంలో ప్రేమ కోసం తాపత్రయపడే యువతకు ఇవి ఓ చక్కని సందేశంగా నిలుస్తున్నాయి.
ఈ సినిమా ప్రయాణంలో కృతి శెట్లికి అండగా నిలిచిన దర్శకుడు విఘ్నేష్ శివన్, సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్ చిత్ర బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సాంకేతికత ఎంత పెరిగినా? మనుషుల మధ్య ఉండే స్వచ్ఛమైన అనుబంధాలను ఏ అల్గారిథమ్ భర్తీ చేయలేదని అంది. ప్రస్తుతం కృతి శెట్టి గ్లామర్ పాత్రలకే కాకుండా బలమైన సందేశం ఉన్న కథలను ఎంచుకుంటూ కెరీర్‌ను విభిన్నంగా మలచుకుంటోంది. ఈ సినిమా విజయం ఆమెకు మంచి ఉత్సాహాన్నించింది. ఈ విజయంతో కొత్త అవకాశాలు ఒడిసిపట్టుకోనుంది.




ఓటీటీ విండోనా లేక టికెట్ ధరల భారమా
Loading..