Advertisementt

అసలు పవన్ కళ్యాణ్ కు ఏమైంది

Sun 19th Apr 2026 01:02 PM
pawan kalyan  అసలు పవన్ కళ్యాణ్ కు ఏమైంది
Pawan Kalyan undergoes surgery, advised few days rest అసలు పవన్ కళ్యాణ్ కు ఏమైంది
Advertisement
Ads by CJ

నిన్న సాయంత్రం ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ కు తీవ్ర అస్వస్థత, శాసనసభ సమావేశాల్లో ఉండగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు సర్జరీ జరిగింది, డాక్టర్స్ కొన్ని వారాల పాటు బెడ్ రెస్ట్ అవసరమన్నారు అంటూ జనసేన ప్రకటించిన కొద్దిసేపటికే ఈ వార్త దావానలంలా వ్యాపించింది. దానితో పవన్ ఫ్యాన్స్ పానిక్ అయ్యిపోయారు. 

అసలు పవన్ కళ్యాణ్ అనారోగ్యం ఏమిటి, ఆయనకు సడన్ గా సర్జరీ జరగడమేమిటి అని అయోమయ పడిపోయారు. అయితే కొన్నాళ్లుగా పవన్ కళ్యాణ్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతున్న విషయం తెలిసిందే. అలాగే రెసిస్టెన్స్ పవర్ తగ్గి తరచూ జ్వరం, నీరసం బారిన పడుతున్నారు.

ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడడంతోనే ఆయన్ను శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో జాయిన్ చెయ్యగా.. అక్కడి వైద్యులు ఆయనకు ముక్కుకు సంబంధించిన డేకేర్ సర్జరీ సజెస్ట్ చెయ్యడమే కాకూండా ఇమ్మిడియట్ గా ఆ సర్జరీ చేసారు. 

శనివారం సాయంత్రం డాక్టర్ మనుస్రుత్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది. శస్త్రచికిత్స అనంతరం పవన్ కల్యాణ్ డిశ్చార్జ్ అయ్యి తన నివాసానికి చేరుకున్నారు. దానితో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, పీఎం మోడీ, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇలా ప్రముఖులంతా పవన్ త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా పవన్ కు పరామర్శల ట్వీట్స్ వేస్తున్నారు. 

Pawan Kalyan undergoes surgery, advised few days rest:

Pawan Kalyan undergoes surgery following health complication

Tags:   PAWAN KALYAN
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ