కెవిన్ ను మెగా ఫ్యామిలీ అంతా వాడేస్తుందా?
Kevin protects Mega Family
`పెద్ది` ప్రమోషన్స్ సమయంలో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చి సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారాడు రామ్ చరణ్ వ్యక్తిగత బాడీగార్డ్ కెవిన్ కుంటా. అతని భారీ కాయం, స్టైలిష్ లుక్, విజయవాడ ఈవెంట్‌లో స్టేజ్ పైకి దూసుకొచ్చిన అభిమానిని క్షణాల్లో ఎత్తేసిన తీరు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇది చూసి కెవిన్ కేవలం రామ్ చరణ్ సినిమా ప్రమోషన్స్ కోసమే కొత్తగా రంగంలోకి దిగాడని చాలామంది భావిస్తున్నారు. కానీ కెవిన్ కుంటు చరణ్ కు మాత్రమే కాదు మెగా ఫ్యామిలీ మొత్తానికి అతడే బాడీ గార్డ్ లా మారాడు.
జాంబియా దేశానికి చెందిన కెవిన్ కుంటు ఇటలీలో స్థిరపడిన ప్రొఫెషనల్ ఎమ్ఎమ్ఏ ఫైటర్. మెగా కాంపౌండ్‌లో అత్యంత నమ్మకమైన వ్యక్తిగా మారాడు. రామ్ చరణ్‌తో పాటు ఉపాసన, సుస్మితా కొణిదెల లేదా ఇతర మెగా హీరోలు పబ్లిక్ ఈవెంట్స్ లేదా వ్యక్తిగత పనుల మీద బయటకు వచ్చినప్పుడు కెవిన్ కుంటా నమ్మకమైన నీడలా పక్కనే కనిపిస్తుండటం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తుంది. మెగా ఫ్యామిలీలోని కీలక సభ్యులందరి రక్షణ బాధ్యతలను ఒకే ఒక్క శక్తిమంతమైన బాడీగార్డ్‌కు అప్పగించడం వెనుక వారికున్న తిరుగులేని నమ్మకం స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే ఈ ఇంటర్నేషనల్ బాడీగార్డ్‌కు రోజుకు రూ 2 లక్షల నుండి 4 లక్షల వరకు భారీ స్థాయిలో పారితోషికం చెల్లిస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్.
పెద్ద సెలబ్రిటీ కుటుంబాలు తమ భద్రతా వ్యవహారాల్లో పదే పదే ఏజెన్సీలను లేదా కొత్త వ్యక్తులను మార్చకుండా అత్యున్నత శారీరక సామర్థ్యం ..వృత్తిపరమైన నైపుణ్యం ఉన్న ఒకే వ్యక్తిని ఫ్యామిలీ బాడీగార్డ్ గా కొనసాగించడం వెనుక బలమైన కారణాలు ఉంటాయి. వ్యక్తిగత గోప్యతను కాపాడుకోవడంతో పాటు, కుటుంబ సభ్యులందరి రోజువారీ అలవాట్లు, భద్రతా అవసరాలపై పూర్తి అవగాహన ఉన్న కెవిన్ వంటి పవర్‌హౌస్‌ను మెగా ఫ్యామిలీ అన్ని రకాలుగా ఉపయోగించుకోవడం వ్యూహాత్మక నిర్ణయంగా భావించొచ్చు. బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్‌కు షేరా ఎలాగో? ఇప్పుడు టాలీవుడ్ మెగా ఫ్యామిలీకి కెవిన్ కుంటా అలా ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటున్నాడు.







































