Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Samantha reveals Sai Pallavi was the first choice for Maa Inti Bangaaram

అసలు బంగారం సాయి పల్లవి అంట

Samantha reveals Sai Pallavi was the first choice for Maa Inti Bangaaram


జూన్ 19 న విడుదల కాబోతున్న మా ఇంటి బంగారం చిత్రంలో సమంత హీరోయిన్ మాత్రమే కాదు ఆమె తన ట్రాలాల బ్యానర్ పై రాజ్ నిడిమోరు నిర్మాతగా ఈచిత్రాన్ని నిర్మించింది. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రం కోసం సమంత చాలా కష్టపడింది అనేది మా ఇంటి బంగారం ట్రైలర్ చూస్తే తెలుస్తుంది.

యాక్షన్ లో సమంత ఇరగదీసేసింది. ఖుషి, శాకుంతలం తర్వాత సమంత శుభం లో చిన్న రోల్ చేసినా ఈ మా ఇంటి బంగారం సక్సెస్ అవ్వాలని సమంత కష్టపడడమే కాదు క్రేజీగా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసింది. అందులో భాగంగా సమంత అభినులతో చిట్ చాట్ చేసింది. ఆ చిట్ చాట్ లో సమంత ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్నీ పంచుకుంది.

మా ఇంటి బంగారం కోసం ముందు సాయిపల్లవిని అనుకున్నారట. సాయి పల్లవిని దృష్టిలో పెట్టుకొని సబ్జెక్టు రెడీ చేసి సాయి పల్లవిని ట్రై చేస్తే డేట్స్ సమస్య వల్ల ఆమె తో సినిమా చేయడం కుదరదని ఆ తర్వాత సమంత కు తగ్గట్టు కొన్ని మార్పులు చేసి ఫైనల్ టచప్ ఇచ్చినట్టుగా సమంత చెప్పుకొచ్చింది.

సో సాయి పల్లవి స్థానంలో ఇప్పుడు మా ఇంటి బంగారం లో మనం సమంత ను చూడబోతున్నాం. ఇది తెలిసాక సాయి పల్లవి యాక్షన్ చేస్తే ఎలా ఉంటుందో ఆమె అభిమానులు ఊహించుకోవడమైతే పక్కా. 

 

Sai Pallavi Reject Samantha's Film