Advertisementt

పవన్ కళ్యాణ్ కు తీవ్ర అస్వస్థత

Sat 18th Apr 2026 08:37 PM
pawan kalyan  పవన్ కళ్యాణ్ కు తీవ్ర అస్వస్థత
Pawan Kalyan Undergoes Surgery పవన్ కళ్యాణ్ కు తీవ్ర అస్వస్థత
Advertisement
Ads by CJ

కొద్దిరోజులుగా పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తరచూ అనారోగ్యంతో సతమతమవుతున్నారు. వైరల్ ఫీవర్ అంటూ అనారోగ్యం బారిన పడుతున్న పవన్ కళ్యాణ్ కి తాజాగా మరోసారి తీవ్ర అస్వస్థత ఏర్పడింది. ఆ విషయమే జనసేన పార్టీ సోషల్ మీడియా వింగ్ అధికారికంగా ట్వీట్ చేస్తూ అసలు పవన్ కి ఏమైందో చెప్పారు.

ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శనివారం సాయంత్రం శస్త్రచికిత్స జరిగింది. శుక్రవారం ఉదయం తన అధికారులతో పాలనాపరమైన విషయాలపై చర్చిస్తున్న సందర్భంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్ది నెలలుగా ఆరోగ్యపరంగా ఇబ్బందిపడుతున్నారు. దీంతో ఆయన వ్యక్తిగత వైద్యుల సలహాతో శుక్రవారంనాటి అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలతోపాటు ఎం.ఆర్.ఐ. కూడా నిర్వహించారు. వాటిని పరిశీలించిన వైద్యులు శస్త్ర చికిత్స చేయవలసి ఉంటుందని నిర్ణయించి, శస్త్రచికిత్స చేశారు. 

వారం నుంచి పది రోజులపాటు విశ్రాంతి తర్వాత ఆయన అధికారిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చని డాక్టర్లు తెలిపారు. అయితే దీర్ఘకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందని, పూర్తి స్వస్థత చేకూరడానికి ఎక్కువ కాలం పడుతుందని డాక్టర్లు చెప్పినట్లుగా ప్రకటించారు.

మినిస్టర్ నారా లోకేష్ 

శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని దేవుడిని ప్రార్థిస్తున్నాను. వైద్యుల సూచ‌న‌ల మేర‌కు విశ్రాంతి తీసుకోండి ప‌వ‌న‌న్న‌. నిత్య‌మూ రాష్ట్రాభివృద్ధి-ప్ర‌జాసంక్షేమమే ఆశ‌, శ్వాస‌గా ప‌నిచేసే మీరు త్వ‌ర‌లో పూర్తి ఆరోగ్య‌వంతులై ప్ర‌జాసేవ‌కు పున‌రంకితం కావాల‌ని ఆకాంక్షిస్తున్నాను.. అంటూ ట్వీట్ చేసారు. 

Pawan Kalyan Undergoes Surgery:

Pawan Kalyan Undergoes Surgery - Advised Bed Rest

Tags:   PAWAN KALYAN
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ